రియో పతకం సాధిస్తే ఖేల్‌రత్న
కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పతకం సాధించిన వారికి వెంటనే ప్రభుత్వం నుంచి గుర్తింపు దక్కనుంది. వీరి పేర్లను ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న, అర్జున అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఈమేరకు కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒలింపిక్స్ విజేతలు తమ గుర్తింపు కోసం ఏడాది పాటు నిరీక్షించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత విభాగంలో పతకం నెగ్గినవారికి ఖేల్త్న్ర దక్కనుంది. అయితే అంతకుముందు వీరు ఈ అవార్డును తీసుకుని ఉండకూడదు. అలాగే టీమ్ ఈవెంట్స్‌లో తమ ప్రతిభతో జట్టును గెలిపించిన వారికి అర్జున అవార్డును అందిస్తారు. వాస్తవానికి ఖేల్త్న్ర, అర్జున పురస్కారాలు దక్కాలంటే ఆటగాళ్లు గత నాలుగేళ్లలో చేసిన అద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారు.