central govt officers
-
ఎయిర్ఇండియా తర్వాత ప్రైవేటీకరించేది వీటినే !
న్యూఢిల్లీ: ఎయిరిండియా ప్రయివేటైజేషన్ తదుపరి అనుబంధ సంస్థల మానిటైజేషన్ పనులను ప్రారంభించనున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. అలయన్స్ ఎయిర్‌సహా నాలుగు అనుబంధ సంస్థలకు చెందిన కీలకం కాని ఆస్తులను మానిటైజ్ చేయనున్నట్లు వెల్లడించారు. రూ. 14,700 కోట్లకుపైగా విలువైన భవనాలు, భూమి తదితర ఆస్తులను ఇందుకు వినియోగించనున్నట్లు తెలియజేశారు. ఎయిరిండియాకు చెందిన ఈ నాలుగు అనుబంధ సంస్థలు ఏఐఏహెచెఎల్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీ(ఎస్పీవీ)లో భాగమైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నెల 8న ఎయిరిండియాను రూ. 18,000 కోట్ల విలువైన బిడ్‌తో టాటా గ్రూప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఎయిరిండియాను సొంతం చేసుకునేందుకు టాటా గ్రూప్ నగదు రూపేణా రూ. 2,700 కోట్లు చెల్లించనుంది. అంతేకాకుండా రూ. 15,300 కోట్ల రుణభారాన్ని స్వీకరించనుంది. ఈ డీల్ డిసెంబర్‌కల్లా పూర్తికావచ్చని అంచనా. ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తోపాటు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సంస్థ ఏఐఎస్ఏటీఎస్ సైతం టాటా గ్రూప్ గూటికి చేరనున్నాయి. చదవండి : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లేఖలో సంచలన విషయాలు? -
‘వాయిదా’కు ఓకే అంటేనే చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులతో జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన 11వ దఫా చర్చలు సుమారు నాలుగున్నర గంటల పాటు జరుగగా, అందులో ఇరుపక్షాలు కేవలం 30 నిమిషాలపాటే ముఖాముఖి భేటీ అయ్యాయి. 10వ దఫా చర్చల సందర్భంగా వ్యవసాయ చట్టాల అమలును 18 నెలల పాటు వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని, చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయం లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేయడంతో చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయి. అయితే ఈ సారి తదుపరి చర్చల విషయంలో తమ వైఖరిని ప్రభుత్వం రైతుల ముందు స్పష్టంచేసింది. తమ ప్రతిపాదనకు ఒప్పుకుంటేనే తదుపరి చర్చలు జరుగుతాయని రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తేల్చిచెప్పారు. దీంతో ఈ నెల 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని కచ్చితంగా నిర్వహించి తీరుతామని వ్యవసాయ సంఘాల నాయకులు చర్చల అనంతరం తెలిపారు. సాగు చట్టాలలో ఎటువంటి సమస్యలు లేనప్పటికీ, రైతుల నిరసనలపై గౌరవంతో వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం ముందుకొచ్చిందని తోమర్ తెలిపారు. చట్టాల అమలును నిలిపివేసే ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చించాలనుకుంటేనే మరో సమావేశానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతు సంఘాలకు తోమర్ స్పష్టం చేశారు. సమావేశం తరువాత కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీకి చెందిన ఎస్ఎస్ పంఢేర్ మీడియాతో మాట్లాడారు. చర్చలకు ఆహ్వానించి వ్యవసాయ మంత్రి తమను మూడున్నర గంటలపాటు వేచి ఉండేలా చేయడం అవమానకరమన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అంగీకరించాలని మంత్రి కోరడంతో తాము నిరసనగా సమావేశం నుంచి బయటికి వచ్చామని వివరించారు. ఈ దఫా చర్చల్లోనూ సాగు చట్టాల రద్దుడిమాండ్ను రైతు సంఘాల నేతలు ముందుకు తేగా ప్రభుత్వం మాత్రం చట్టాల సవరణకు సిద్ధంగా ఉందని చెప్పిందని రైతు నాయకుడు శివ కుమార్ కక్క తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను పరిశీలించాలని మంత్రి తమను కోరినప్పుడు, తమ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించాలని తాము కోరామని, మంత్రి సమావేశం నుంచి వెళ్ళిపోయారని శివకుమార్ పేర్కొన్నారు. అంతకుముందు, రైతు నాయకుల అంతర్గత సమావేశాల్లో.. ప్రభుత్వానికి మరో కొత్త ప్రతిపాదన ఇవ్వాలన్న చర్చ సైతం జరిగింది. చట్టాల అమలును ఏడాదిన్నర కాకుండా, మూడేళ్ల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కొందరు నేతలు సూచించారు. అంతేగాక వ్యవసాయ రుణ పరిమితిని ఎకరానికి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని, పాత వడ్డీ రేటును కొనసాగించాలని ప్రతిపాదించారు. 26న ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుంది: రాకేశ్ టికైత్ ప్రభుత్వంతో 11వ దఫా చర్చలు అసంపూర్తిగా ముగిసిన తర్వాత భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైత్ మీడియాతో మాట్లాడారు. ముందుగా నిర్ణయించినట్లుగా, జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అయితే ట్రాక్టర్ పరేడ్‌కు సంబంధించిన అనుమతి కోసం పోలీసులు, రైతులు మధ్య గురువారం జరిగిన మూడో రౌండ్ సమావేశం అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. రైతుల పరేడ్‌కు అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. కుండ్లి–మనేసర్–పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే పై పరేడ్ జరపాలని పోలీసులు సూచించారు. అందుకు రైతులు అంగీకరించలేదు. -
రూ. 22కే కిలో విదేశీ ఉల్లి
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని కిలో రూ. 22 నుంచి రూ. 23కే రాష్ట్రాలకు విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. ప్రస్తుతం ఇలా దిగుమతి చేసుకున్న ఉల్లిని కేంద్రం రూ. 58కి అమ్ముతోంది. అయితే తాజాగా ఉల్లి పంట చేతికి రావడం, రుచిలో దేశీ ఉల్లి బాగుండటంతో విదేశీ ఉల్లిని కొనుగోలు చేయడానికి రాష్ట్రాలు ముందుకు రాకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత నవంబర్‌లో కేంద్రం విదేశాల నుంచి 14 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. అందులో నుంచి భారీస్థాయిలో ఉల్లి అమ్ముడుకుండా పోర్టుల వద్దే మిగిలిపోయింది. ఇలా మిగిలిప ఉల్లి కుళ్లిపోతుండటం, మార్కెట్లో దేశీ ఉల్లి అందుబాటులోకి రావడంతో కేంద్రం ఉల్లి ధరలు తగ్గించాలని నిర్ణయించింది. -
సెట్‌టాప్ బాక్స్ లేకుంటే ప్రసారాలు బంద్
హైదరాబాద్: నాలుగో విడత డిజిటలైజేషన్ ప్రక్రియను డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంఎస్ఓలు సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించింది. సెట్‌టాప్ బాక్సులు లేకపోతే 2017 జనవరి ఒకటో తేదీ నుంచి కేబుల్ ప్రసారాలు నిలిచిపోతాయని తేల్చిచెప్పింది. ఇప్పటికే వివిధ ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా ఎస్టీపీ బాక్సులపై విస్తృత ప్రచారం చేశామని, దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి జయశ్రీ ముఖర్జీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. డిజటలైజేషన్ అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించుకోవాలని, సెట్‌టాప్ బాక్సులు ఎన్ని అవసరం, ఎన్ని అమర్చారనే దానిపై నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. అలాగే, వినియోగదారులకు అవగాహన కల్పించేలా ఎంఎస్ఓ/ కేబుల్ టీవీ అపరేటర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని జయశ్రీ ముఖర్జీ ఆ లేఖలో కోరారు.