ఐఐటీల్లో పరిశోధకుల ఫెలోషిప్ పెంపు!
⇒ నెలకు రూ.25 వేల నుంచి రూ.75 వేలకు పెంచే యోచన
⇒ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కసరత్తు
⇒ మధ్యలో మానేస్తే తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
⇒ బీటెక్ తర్వాత నేరుగా పీహెచ్‌డీకి అవకాశం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటీల్లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్డీ) చేసే వారికి ఇచ్చే ఫెలోషిప్‌ను పెంచేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం నెలకు రూ.25 వేలు ఇస్తున్న ఫెలోషిప్‌ను రూ.75 వేలకు పెంచేందుకు చర్యలు చేపడుతోంది. పరిశోధనా కార్యక్రమాల్లో మరింత నాణ్యతను తీసుకొచ్చేందుకు ఈ చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. గత ఏడాదే ఐఐటీ కౌన్సిల్ దీనికి ఆమోదం తెలిపింది. తాజాగా ఎంహెచ్ఆర్డీ పరిశీలనకు పంపిన ఈ ప్రతిపాదనపై త్వరలోనే నిర్ణయం వెలువడనుందని ఐఐటీ వర్గాలు వెల్లడించాయి.
బీటెక్‌తోనే నేరుగా పీహెచ్‌డీకి అవకాశం..
ప్రస్తుతం పీహెచ్‌డీలో చేరాలంటే విద్యార్థులు మాస్టర్ డిగ్రీ (ఎంటెక్) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా దేశంలోని 23 ఐఐటీల్లో 25 వేల మంది విద్యార్థులు పీహెచ్‌డీలు చేస్తున్నారు. వారికి ఈ అవకాశం కల్పించడంతోపాటు బీటెక్‌తోనే నేరుగా పీహెచ్‌డీలో చేరే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణ యించింది. తద్వారా పరిశోధనలకు పెద్దపీట వేసినట్లవుతుందని భావిస్తోంది. పరిశోధనలు చేసేందుకు ఆసక్తిని పెంపొందించేందుకు ఫెలోషిప్ పెంచ డంతోపాటు బీటెక్ తర్వాత నేరుగా పీహెచ్డీ ప్రవేశాలకు దోహదపడతాయని భావిస్తోంది. అగ్రశ్రేణి కంపెనీలు పీహెచ్డీ చేసిన వారికి ప్రా«ధాన్యం ఇçస్తుండటంతో ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఐఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఐఐటీల్లో పరిశోధనలు చేస్తున్న 25 వేల మంది విద్యార్థులకూ ఈ ఫెలోషిప్ పెంపును వర్తింపజేస్తారని భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఐఐటీ వర్గాలు తెలిపాయి.
మానేస్తే.. తిరిగి చెల్లించాల్సిందే..
ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్న వారు తమ పరిశోధనను మ«ధ్యలో మానేస్తే నెలకు రూ.25 వేలు ఇస్తున్న ఫెలోషిప్ ను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆ నిబంధనను కూడా మార్చేందుకు చర్యలు చేపట్టింది. నెలకు రూ.75 వేలు ఫెలోషిప్ పొందే విద్యా ర్థులు కనుక మధ్యలో పరిశోధనను మానేస్తే తాము తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలన్న నిబంధనను పొందుపరుస్తోంది. తద్వారా పరిశోధనలు మధ్యలో ఆపేయకుండా చేయడం తోపాటు ప్రతి పరిశోధనా కచ్చితంగా పూర్తి అవుతుందని, వాటి ప్రయోజనాలు సమాజానికి ఉప యోగపడతాయని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో ఫెలోషిప్ పెంపుతో పాటు కొత్తగా దాదాపు వెయ్యి మంది విద్యార్థులకు పీహెచ్‌డీల్లో ప్రవేశాలను కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.