Central jobs
-
ఆ ఉద్యోగ పరీక్షలు.. ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్నిరకాల పోటీ పరీక్షలను తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, పెన్షన్ల శాఖ మంత్రి జితేంద్రసింగ్‌కు ఆదివారం లేఖ రాశారు. కేంద్ర సర్వీసులు, శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ, ఇతర నియామక సంస్థలు నిర్వహించే పోటీపరీక్షలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలవారు పోటీపడతారని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ పరీక్షలను ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని.. దీనివల్ల ఆంగ్లేతర మాధ్యమంలో చదివినవారు, హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం అమలు చేయండి జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి.. జాతీయ పోటీ పరీక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలను 12 భారతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని కేటీఆర్ లేఖలో గుర్తు చేశారు. కానీ అమల్లో తాత్సారం జరుగుతోందన్నారు. తాజాగా కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కానిస్టేబుళ్ల నియామకాలు, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్‌మెన్ ఎగ్జామినేషన్ తదితర నోటిఫికేషన్లలో కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల ప్రాంతీయ భాషల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. కేంద్ర ప్రభుత్వ, అనుబంధ శాఖలు, ఎస్ఎస్సీ, ఆర్బీఐ, పీఎస్బీ, యూపీఎస్సీ వంటి పరీక్షలను ప్రాంతీయ భాషల్లో సైతం నిర్వహించాలని కోరారు. ప్రస్తుత నోటిఫికేషన్లను నిలిపేసి.. అన్ని భాషల్లో పరీక్షలు నిర్వహించేలా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. -
బడ్జెట్: పెరిగిన కొలువులు!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 1 నాటికి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని మొత్తం కొలువుల సంఖ్య 34,14,226కు చేరనున్నట్లు సోమవారం బడ్జెట్లో వెల్లడించారు. మార్చి 1, 2019 నాటికి 32,71,113 కేంద్ర ఉద్యోగాలు ఉండగా, ఈ ఏడాది మార్చి 1 నాటికి 1,43,113 ఉద్యోగాలు పెరగనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, సహకార, రైతు సంక్షేమం శాఖలో మార్చి 1, 2019 నాటికి 3,619 ఉద్యోగాలు ఉండగా ఈ రెండేళ్లలో 2,207 పెరిగి 5,826కు చేరనున్నాయి. అలాగే పౌరవిమానయానంలో 1,058 పెరిగి 1,254 నుంచి 2,312కు, రక్షణ శాఖలో 12,537 పెరిగి 80,463 నుంచి 93,000కు చేరనున్నాయి. అలాగే సాంస్కృతిక శాఖలో 3,638, ఎర్త్ సైన్సెస్‌లో 2,859, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖలో 2,263, విదేశీ వ్యవహారాల్లో 2,204, వాణిజ్యంలో 2,139, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 1,452; ఆరోగ్య–కుటుంబ సంక్షేమంలో 4,072, కార్మిక–ఉపాధి కల్పనలో 2,419, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగానది పునర్వవస్థీకరణలో 1,456 పెరగనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన విభాగాల్లోనూ ఇలాగే పెరిగినట్లు వివరించారు. చదవండి: బడ్జెట్: ఈ విషయాలు మీకు తెలుసా! చదవండి: బడ్జెట్ 2021: రక్షణ రంగం కేటాయింపులు.. ‘గిగ్’ కార్మికులకూ సామాజిక భద్రత న్యూఢిల్లీ: ఈ కామర్స్ వ్యాపార సంస్థల్లో పనిచేసే ‘గిగ్’ కార్మికులకూ సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పిస్తామని కేంద్రం సోమవారం తెలిపింది. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. గిగ్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతరుల సమాచారం సేకరించేందుకు ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులతో సహా మొత్తం శ్రామికశక్తికి తొలిసారి సామాజిక భద్రతను కల్పించడానికి నిబంధనలు రూపొందించినట్లు ఆమె వెల్లడించారు. ఉబెర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వంటి ఈ–కామర్స్ సంస్థల్లో పనిచేసే గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులకు క్రమబద్ధమైన వేతనాలు ఉండవు. దీంతో ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్య బీమా, పెన్షన్లు వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారు. దేశంలో మొత్తం 50 కోట్లకు పైగా శ్రామిక శక్తి ఉండగా ఇందులో 40 కోట్లు అసంఘటిత రంగాల్లోనే ఉన్నారు. వీరిలో ఎక్కువగా వ్యవసాయ, గ్రామీణ కార్మికులే ఉన్నారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధం, సామాజిక భద్రత, వృత్తి భద్రత, ఆరోగ్యం–పని పరిస్థితులపై తెచ్చిన కార్మిక చట్టాలకు సంబంధించిన సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని నిర్మల పేర్కొన్నారు. చదవండి: కేంద్ర బడ్జెట్: ఇందులో నాకేంటి? -
మనకు కేంద్ర ఉద్యోగాలు వద్దా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర యువత దూరం ⇒ 2015లో 57 వేల పోస్టులకు తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు పొందింది 8 శాతమే ⇒ సరైన శిక్షణ, మార్గదర్శనం లేకే కేంద్ర ఉద్యోగాలపై అనాసక్తి ⇒ రాష్ట్ర యువత తీరుపై పరిశీలన జరిపిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై రాష్ట్ర యువతలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. డిగ్రీ అర్హతతో రాష్ట్రంలో భర్తీ చేసే గ్రూప్–2 వంటి ఉద్యోగాలకు లక్షలాది మంది దరఖాస్తు చేస్తున్నా... అదే అర్హతతో కేంద్రం అధీనంలోని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వంటి సంస్థలు జారీ చేస్తున్న నోటిఫికేషన్లపై మాత్రం ఆసక్తి చూపడం లేదు. సొంతంగా సిద్ధమయ్యే పరిస్థితి లేకపోవడం, తగిన శిక్షణ అందకపోవడమే దీనికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం... కేంద్ర ఉద్యోగాలకు సిద్ధమయ్యే రాష్ట్ర యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదీ పరిస్థితి: 2015లో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లోని 57,542 పోస్టులను భర్తీ చేసింది. తెలంగాణ నుంచి ఉద్యోగాలు పొందిన వారు తక్కువ. ఎస్ఎస్సీ సదరన్ రీజియన్ పరిధిలో తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తం 57,542 పోస్టుల్లో సదరన్ రీజియన్ రాష్ట్రాల వారికి దక్కిన పోస్టులు 4,932 (8.58 శాతం) మాత్రమే. ఇందులో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు దక్కించుకున్న పోస్టులు 3 శాతం లోపే. అదే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 19,426 (33.21 శాతం) దక్కించుకున్నారు. సెంట్రల్ రీజియన్ పరిధిలోని రాష్ట్రాల అభ్యర్థులు 11,269 (21.31 శాతం) దక్కించుకున్నారు. మిగతా పోస్టులను ఈస్టర్న్ రీజియన్ రాష్ట్రాలవారు సొంతం చేసుకున్నారు. ఎస్ఎస్సీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కేంద్ర ఉద్యోగాలపై దృష్టి.. ప్రస్తుత పరిస్థితుల్లో స్వయం ఉపాధి అవకాశా లను అందుబాటులోకి తేవడంతోపాటు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు యువతను సిద్ధం చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి కె.తారకరామారావు ఆ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే వంటి విభాగాల ఆధ్వర్యంలో ఏటా 50 వేల నుంచి లక్ష వరకు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 2018 నాటికి 2.83 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీంతో ఆ ఉద్యోగాలకు రాష్ట్ర యువతను సిద్ధం చేసేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల యువతకు ఈ శిక్షణ అందించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అవుతుం దని భావిస్తోంది. అందుకే మన టీవీ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శిక్షణలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రత్యామ్నాయంగా చూపితే మేలు.. రాష్ట్రంలో డిగ్రీ నుంచి మొదలు కొని పీజీలు, పీహెచ్‌డీలు, వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులు పూర్తి చేసి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత 13 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా. టీఎస్పీఎస్సీ అమల్లో కి తెచ్చిన వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఓటీఆర్‌లో భారీ సంఖ్యలో రిజిస్టర్ చేసుకున్నారు కూడా. రాష్ట్ర ప్రభుత్వంలోనూ పెద్దగా ఉద్యోగాలను భర్తీ చేయలేని పరిస్థితి. వివిధ కారణాలతో సకాలంలో నోటిఫికేషన్లు జారీ చేయలేకపోతోంది. అయితే ఉద్యోగాలు ఆశిస్తున్నవారి సంఖ్యతో పోలిస్తే.. ఉద్యోగాల భర్తీ చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది.