కేంద్ర సాంఘిక సంక్షేమ మండలిలో బుట్టా రేణుక
కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి పార్లమెంటు నుంచి ప్రాతినిథ్యం వహించే ఇద్దరు సభ్యుల్లో ఒకరిగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బుట్టా రేణుక నియమితులయ్యారు. మరొక ఎంపీ ప్రియాంక రావత్ కూడా నియమితులయ్యారు. వీరు ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. రాష్ట్రాల సాంఘిక సంక్షేమ మండలి ఛైర్పర్సన్లు కూడా ఈ మండలిలో సభ్యులుగా కొనసాగుతారు.