ఇంటర్ వర్సిటీ సెంట్రల్ జోన్ చెస్ విజేత ఓయూ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ యూనివర్సిటీ సెంట్రల్ జోన్ చెస్ టోర్నమెంట్లో టీమ్ టైటిల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) జట్టు సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ఈటోర్నీలో ఓయూ జట్టు ఆటగాళ్లు సత్తా చాటారు. గత ఏడాది కేరళలోని తిరుచూర్‌లో జరిగిన సౌత్ జోన్ ఇంటర్ వర్సీటీ చెస్ టోర్నీలోనూ ఓయూ జట్టు చాంపియన్‌గా నిలిచింది.
అయితే ఈ ఏడాది నుంచి ఓయూను సౌత్ జోన్ నుంచి సెంట్రల్ జోన్‌కు మార్చారు. ఈ పోటీల్లో ఓయూ జట్టు ఓవరాల్‌గా మొత్తం ఆరు రౌండ్లు ముగిసే సమయానికి 11 పాయింట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచింది. హైదరాబాద్ జేఎన్టీయూ 10 పాయింట్లతో రెండో స్థానం, ఉత్కల్ యూనివర్సిటీ జట్టు 9 పాయింట్లతో మూడో స్థానం పొందింది.
నాగ్‌పూర్‌కు చెందిన ఆర్ టీఎంయూ జట్టుకు నాలుగో స్థానం లభించింది. దీంతో సెంట్రల్ జోన్ నుంచి ఓయూతో పాటు మిగతా మూడు జట్లు మహారాష్ట్రలోని మహత్మ జ్యోతిరావ్ పూలే అగ్రికల్చర్ యూనివర్సిటీలో జనవరి 13 నుంచి 17 వరకు జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సీటీ చెస్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి.
ఓయూ జట్టు తరపున సి.ఆర్.కృష్ణ(కెప్టెన్), ఎస్.రవితేజ, ఎం.దీప్త్తాంశ్రెడ్డి, విశ్వనాథ్ ప్రసాద్, ఆనంద్‌నాయక్, కె.నిఖిల్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కోచ్‌గా కె.కన్నారెడ్డి, మేనేజర్‌గా మేజర్ కె.ఎ.శివప్రసాద్ వ్యవహరించారు.