Centurion University Associate
-
ఈనెల 18న సాక్షి మాక్ ఎంసెట్
ఒంగోలు : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని లక్షలాది మంది ఇంజినీరింగ్, మెడికల్ ఔత్సాహిక విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా సాక్షి మీడియా గ్రూపు ఆధ్వర్యంలో సాక్షి మాక్ ఎంసెట్-2016ను నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 18 (సోమవారం)న ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. గతేడాది సాక్షి నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు దాదాపు 20 వేల మంది హాజరై తమ ప్రతిభను పదును పెట్టుకున్నారు. ఈ మాక్ ఎంసెట్ ప్రశ్నపత్రాలను సాక్షి భవితకు సంబంధించిన సీనియర్ లెక్చరర్లు రూపొందిస్తారు. ఎంసెట్ పరీక్షకు 15 రోజుల ముందు నిర్వహించే ఈ నమూనా పరీక్ష..విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాక ప్రతిభను పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. రూ.100 చెల్లించి సాక్షి మాక్ ఎంసెట్ దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చు. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకొస్తే వెంటనే హాల్‌టికెట్ తీసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ ఈనెల 15 వరకు, దరఖాస్తు ఫారాలు లభించే కేంద్రాలు, పరీక్ష కేంద్రాల వివరాలు ప్రకటిస్తున్నాం. ఇంజినీరింగ్, మెడికల్ విభాగాల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి వేర్వేరుగా టాప్-3 ర్యాంకులు పొందిన వారికి బహుమతులు అందజేస్తారు. జూనియర్ కళాశాలల నిర్వాహకులు ఏకమొత్తంగా ఈ మాక్ ఎంసెట్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు. దరఖాస్తు కోసం సంప్రదించాల్సిన చిరునామా సాక్షి లోకల్ ఆఫీస్, కేరాఫ్ మెట్ల రాఘవరాణి, మెట్ల వెంకటసుబ్బయ్య వీధి, బిసైడ్స్ మున్సిపల్ ఆఫీసు, ఒంగోలు. పరీక్ష కేంద్రాలు 1.ఎస్ఎస్ఎన్ డిగ్రీ కళాశాల, మంగమూరు రోడ్డు, ఒంగోలు 2.శ్రీ వాణి జూనియర్ కాలేజీ, రైల్వే స్టేషన్ వద్ద, కామధేను కాంప్లెక్స్ వెనుక, చీరాల, ప్రకాశం జిల్లా, సంప్రదించాల్సిన నంబర్లు: 9949374012, 9963771698 -
18న ‘సాక్షి మాక్ ఎంసెట్’
15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు, వారి ప్రతిభకు మరింత పదనుపెట్టేందుకు ‘సాక్షి మీడియా’ గ్రూప్ ‘మాక్ ఎంసెట్-2016’ నిర్వహణకు సన్నాహాలు చేపట్టింది. సాక్షి మీడియా గ్రూప్, అన్నమాచా ర్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మాక్ ఎంసెట్‌కు సెంచూరియన్ యూనివర్సిటీ అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. రెం డు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 18న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంట ల వరకు నిర్వహించనున్న మాక్ ఎంసెట్ పరీక్షకు ఎంసెట్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థులందరూ హాజ రు కావచ్చు. ఆసక్తి గల విద్యార్థులు రూ.100 చెల్లించి దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులకు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను జత చేసి వెంటనే హాల్‌టికెట్ తీసుకోవచ్చు. ఇంజినీరింగ్, మెడికల్ విభాగాల్లో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా టాప్-3 ర్యాంకులు పొందిన విద్యార్థులకు బహుమతులు అం దజేస్తారు. ఇంటర్మీడియెట్ కళాశాలల నిర్వాహకులు ఏకమొత్తంగా మాక్ ఎంసెట్‌కు వివరాలు నమోదు చే సుకునే అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీ లోపు దర ఖాస్తు చేసుకో వాలని నిర్వాహకు లు సూచించారు. దరఖాస్తు ఫారాలు లభించే కేంద్రాలు అప్లికేషన్ సెంటర్స్ : 1. సాక్షి ఆఫీసు, కవితా కాంప్లెక్స్, మొదటి అంతస్తు, ఆంధ్రా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ పక్కన, గోదాం రోడ్, నిజామాబాద్ - 503 001. సెల్ : 9010202787 2. సాక్షి ఆఫీసు, సర్వే నెం. 158/ఏ, ఎఫ్‌సీఐ గోదాం పక్కన, నడిపల్లి గ్రామం, డిచ్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా పరీక్ష కేంద్రం : కాకతీయ జూనియర్ కాలేజీ, మెయిన్ క్యాంపస్, ప్రగతినగర్, ఫూలాంగ్ ఎక్స్ రోడ్ దగ్గర, నిజామాబాద్.