ఈనెల 18న సాక్షి మాక్ ఎంసెట్ | On 18th April Sakshi Mack EAMCET | Sakshi
Sakshi News home page

ఈనెల 18న సాక్షి మాక్ ఎంసెట్

Published Sun, Apr 10 2016 3:33 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

ఈనెల 18న సాక్షి మాక్ ఎంసెట్

ఈనెల 18న సాక్షి మాక్ ఎంసెట్

ఒంగోలు : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని లక్షలాది మంది ఇంజినీరింగ్, మెడికల్ ఔత్సాహిక విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా సాక్షి మీడియా గ్రూపు ఆధ్వర్యంలో సాక్షి మాక్ ఎంసెట్-2016ను నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 18 (సోమవారం)న ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. గతేడాది సాక్షి నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు దాదాపు 20 వేల మంది హాజరై తమ ప్రతిభను పదును పెట్టుకున్నారు.
 
ఈ మాక్ ఎంసెట్ ప్రశ్నపత్రాలను సాక్షి భవితకు సంబంధించిన సీనియర్ లెక్చరర్లు రూపొందిస్తారు. ఎంసెట్ పరీక్షకు 15 రోజుల ముందు నిర్వహించే ఈ నమూనా పరీక్ష..విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాక ప్రతిభను పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. రూ.100 చెల్లించి సాక్షి మాక్ ఎంసెట్ దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చు. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకొస్తే వెంటనే హాల్‌టికెట్ తీసుకోవచ్చు.

దరఖాస్తు చివరి తేదీ ఈనెల 15 వరకు, దరఖాస్తు ఫారాలు లభించే కేంద్రాలు, పరీక్ష కేంద్రాల వివరాలు ప్రకటిస్తున్నాం. ఇంజినీరింగ్, మెడికల్ విభాగాల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి వేర్వేరుగా టాప్-3 ర్యాంకులు పొందిన వారికి బహుమతులు అందజేస్తారు. జూనియర్ కళాశాలల నిర్వాహకులు ఏకమొత్తంగా ఈ మాక్ ఎంసెట్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు.
 
దరఖాస్తు కోసం సంప్రదించాల్సిన చిరునామా
సాక్షి లోకల్ ఆఫీస్, కేరాఫ్ మెట్ల రాఘవరాణి, మెట్ల వెంకటసుబ్బయ్య వీధి, బిసైడ్స్ మున్సిపల్ ఆఫీసు, ఒంగోలు.
 
పరీక్ష కేంద్రాలు
1.ఎస్‌ఎస్‌ఎన్ డిగ్రీ కళాశాల, మంగమూరు రోడ్డు, ఒంగోలు
2.శ్రీ వాణి జూనియర్ కాలేజీ,  రైల్వే స్టేషన్ వద్ద, కామధేను కాంప్లెక్స్ వెనుక, చీరాల, ప్రకాశం జిల్లా,
 సంప్రదించాల్సిన నంబర్లు: 9949374012, 9963771698

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement