18న ‘సాక్షి మాక్ ఎంసెట్’ | On 18th April Sakshi Mack EAMCET | Sakshi
Sakshi News home page

18న ‘సాక్షి మాక్ ఎంసెట్’

Published Sun, Apr 10 2016 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

18న ‘సాక్షి మాక్ ఎంసెట్’

18న ‘సాక్షి మాక్ ఎంసెట్’

15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు, వారి ప్రతిభకు మరింత పదనుపెట్టేందుకు ‘సాక్షి మీడియా’ గ్రూప్ ‘మాక్ ఎంసెట్-2016’ నిర్వహణకు సన్నాహాలు చేపట్టింది.  సాక్షి మీడియా గ్రూప్, అన్నమాచా ర్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మాక్ ఎంసెట్‌కు సెంచూరియన్ యూనివర్సిటీ అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. రెం డు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 18న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంట ల వరకు నిర్వహించనున్న  మాక్ ఎంసెట్ పరీక్షకు ఎంసెట్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థులందరూ హాజ రు కావచ్చు.

ఆసక్తి గల విద్యార్థులు రూ.100 చెల్లించి దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులకు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను జత చేసి వెంటనే హాల్‌టికెట్ తీసుకోవచ్చు. ఇంజినీరింగ్, మెడికల్ విభాగాల్లో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా టాప్-3 ర్యాంకులు పొందిన విద్యార్థులకు బహుమతులు అం దజేస్తారు. ఇంటర్మీడియెట్ కళాశాలల నిర్వాహకులు ఏకమొత్తంగా మాక్ ఎంసెట్‌కు వివరాలు నమోదు చే సుకునే అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీ లోపు దర ఖాస్తు చేసుకో వాలని నిర్వాహకు లు సూచించారు.
 
దరఖాస్తు ఫారాలు లభించే కేంద్రాలు అప్లికేషన్ సెంటర్స్ :
 
1. సాక్షి ఆఫీసు, కవితా కాంప్లెక్స్, మొదటి అంతస్తు, ఆంధ్రా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ పక్కన, గోదాం రోడ్, నిజామాబాద్ - 503 001.
సెల్ : 9010202787
2. సాక్షి ఆఫీసు, సర్వే నెం. 158/ఏ, ఎఫ్‌సీఐ గోదాం పక్కన, నడిపల్లి గ్రామం, డిచ్‌పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా
 
పరీక్ష కేంద్రం :
కాకతీయ జూనియర్ కాలేజీ, మెయిన్ క్యాంపస్, ప్రగతినగర్, ఫూలాంగ్ ఎక్స్ రోడ్ దగ్గర, నిజామాబాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement