డీఆర్డీఏ పీడీ జ్యోతిని రిలీవ్ చేయాలని ఉత్తర్వులు
అడిషనల్ పీడీ సుధాకర్‌కు తాత్కాలిక బాధ్యతలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ప్రాజెక్టు డెరైక్టర్ జ్యోతిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌కు సెర్ఫ్ సీఈఓ రాజశేఖర్ నుంచి ఉత్తర్వులొచ్చాయి. పీడీ బాధ్యతలను తాత్కాలికంగా అడిషనల్ ప్రాజెక్టు డెరైక్టర్‌గా కొనసాగుతున్న సుధాకర్‌కు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్యాంపులో ఉన్న జ్యోతి రాగానే రిలీవ్ చేయనున్నట్టు కలెక్టర్ తెలిపారు.
డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న డీఆర్డీఎ ప్రాజెక్టు డెరైక్టర్ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి, మాతృశాఖకు పం పించేయాలని అటవీశాఖ ఉన్నతాధికారులు గత నెల 31వ తేదీనే రీ పేట్రియేట్ ఉత్తర్వులు జారీ చేశారు. రిలీవైన తర్వాత ఎన్విరాన్మెంట్, ఫారెస్టు స్టేట్ హెడ్ ఆఫీస్‌కు రిపోర్టు చేయాలని జ్యోతికి సూచిస్తూ కలెక్టర్‌కు ఉత్తర్వులు పం పించారు. కాకపోతే సెర్ఫ్ కంట్రోల్లో ప్రస్తుతం పని చేస్తున్నందున అక్కడి నుంచి ఉత్తర్వులొచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని కలెక్టర్ వేచి చూశారు. ఈ విధంగా దాదాపు 22 రోజులు గడిచిపోయాయి. దీంతో ఆమె రీపేట్రియేట్ ఉత్తర్వులు ఆగిపోయి ఉంటాయని అంతా భావించారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం సెర్ఫ్ నుంచి కూడా రిలీవ్ చేయాలంటూ కలెక్టర్ ఉత్తర్వులొచ్చాయి. దీంతో ఆమెను రిలీవ్ చేసేందుకు సిద్ధమయ్యారు. జ్యోతి డీఆర్డీఎ పీడీగా 2012 డిసెంబర్ 27వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు సామాజిక అటవీశాఖ డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్‌గా పనిచేశారు.