ఆర్థికాభివృద్ధి సాధించాలి
ఉట్నూర్‌రూరల్, న్యూస్‌లైన్ : సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సెర్ప్ సీఈవో బి.రాజశేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని ఘన్పూర్ గ్రామంలో గ్రామ సమైక్య సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా పథకం, దీపం, బంగారుతల్లి తదితర పథకాలు అర్హులకు అందేలా చూడాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం పెంపొందించేందుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని, బంగారుతల్లి పథకంపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. రుణాల రికవరీపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లురెడ్డి, ఐకేపీ ఏపీడీ నూరొద్దీన్, ఏడీఎం అండ్ హెచ్‌వో ప్రభాకర్‌రెడ్డి, ఏఎంవో వెంకటేశ్వర్లు, జిల్లా సమైక్య అధ్యక్షురాలు భాగ్య, ఏసీ కల్యాణ్, ఏపీఎం గంగాధర్ పాల్గొన్నారు.