Chadha
-
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా రాజీనామా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు అందజేశారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపాలని ‘ఆప్’ నిర్ణయించడంతో ఎమ్మెల్యే పదవిని రాఘవ్ చద్దా వదులుకున్నారు. ‘ఢిల్లీ విధానసభకు నేను రాజీనామా చేశాను. సభాపతితో సహా సభ్యులందరూ నన్ను ఎంతో ఆదరించారు. పంజాబ్ తరపున రాజ్యభలో బలంగా గళం వినిపిస్తాను. పంజాబ్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాన’ని రాఘవ్ చద్దా ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. ఐదుగురు అభ్యర్థులు రాఘవ్ చద్దాతో పాటు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఐఐటీ ప్రొఫెసర్ సందీప్ పాఠక్, విద్యావేత్త అశోక్ కుమార్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ్య అభ్యర్థులుగా మార్చి 21న ప్రకటించింది. పంజాబ్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్ 9న ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు నిర్వహించనున్నారు. (క్లిక్: పంజాబ్ సీఎం సంచలన ప్రకటన) యంగెస్ట్ ఎంపీ! 33 ఏళ్ల రాఘవ్ చద్దా.. రాజ్యసభలో అతి పిన్న వయస్కుడైన సిట్టింగ్ సభ్యునిగా గుర్తింపు పొందనున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జిగా ఆయన వ్యవహరించారు. వృత్తిరీత్యా చార్టెట్ అకౌంటెంట్ అయిన చద్దా.. ఢిల్లీ లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేటైన చద్దాకు ఆ రాష్ట్రంలో గట్టి పట్టుంది. (క్లిక్: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు) -
రూ.100 కోట్ల స్కాం : లిక్కర్ బారెన్ కుమారుడు అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : లిక్కర్ బారెన్ పాంటీ చద్దా కుమారుడు, వేవ్ గ్రూపు వైస్ ఛైర్మన్ మణిప్రీత్ సింగ్ (మోంటీ చద్దా)ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 100 కోట్ల కుంభకోణం కోసులో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేశారు. ధాయ్‌లాండ్‌కు పారిపోతుండగా అధికారులు చద్దాను అడ్డుకున్నారు. చౌక ధరలో ఫ్లాట్లను ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చి వినియోగదారులను మోసం చేశారన్న ఆరోపణలపై అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉప్పల్-చద్దా హైటెక్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, వేవ్ గ్రూపు వైస్ చైర్మన్ మోంటీ చందాను బుధవారం అరెస్ట్ చేశారు. రూ.100 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారని అధికారులు ఆరోపించారు. చద్దాను గురువారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ ( ఆర్థిక నేరాల విభాగం) సువాష్ష్ చౌదరి తెలిపారు. ఘజియాబాద్‌లో హౌటెక్ టౌన్షిప్ పేరుతో కొనుగోలుదారును మోసం చేసిన కేసులో 2018, జనవరిలో మోంటీ చద్దా, ఇతర కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వేవ్ గ్రూప్‌తోపాటు, ఇతర ప్రమోటర్లపై లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. రోజ్‌వుడ్ ఎన్క్లేవ్, సన్నీవుడ్ ఎన్క్లేవ్, లైమ్వుడ్ ఎన్క్లేస్, చెస్ట్వుడ్ ఎన్క్లేవ్ టౌన్షిప్పేరుతో గృహకొనుగోలుదారులను ఆకర్షించాడు. ఇళ్ళు, విల్లాలు గోల్ఫ్ కోర్సు, హెలిపాడ్స్, ఇంటర్నేషనల్ స్కూలు, కాలేజ్,షాపింగ్ మాల్స్ తదితర అత్యాధునిక సదుపాయాలంటూ వారిని మభ్య పెట్టారు. కానీ ప్లాట్లను వారికి కేటాయించడంలో విఫలమైనారనేది ప్రధాన అరోపణ. దాదాపు 11 సంవత్సరాలుగా వీరి చేతుల్లో బాధితులు నానా అగచాట్లు పడుతున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాగా ఆస్తుల వివాదంలో 2012లో మోంటీ చద్దా తండ్రి వివాదాస్పద మద్యం వ్యాపారి, రియల్ ఎస్టేట్ వ్యాపారి పాంటీ చద్దాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అప్పటినుంచి తండ్రి బాధ్యతలను మోంటీ చేపట్టారు. -
ఆ రేపిస్టులను శిక్షపడాలి..
పారిస్: జౌహౌరా 16 ఏళ్ల అమ్మాయి. మధ్య ఆఫ్రికాలోని ఛాడ దేశస్థురాలు. మాతృదేశంలోనే ఆమెకు ఘోరం జరిగిపోయింది. ముగ్గురు జనరల్స్ కుమారులు, విదేశాంగ మంత్రి మౌసా ఫకీ మహమత్ కుమారుడు సహా ఐదుగురు కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘోరాన్ని ఆమె తనలోనే దాచుకొని కుమిలిపోకుండా ధైర్యంగా సమాజం ముందుకు వచ్చింది. తన పేరును, గుర్తింపును స్వచ్ఛందంగా బయటపెట్టింది. నేరస్థులను శిక్షించేందుకు పోరాటం మొదలు పెట్టింది. తనకే కాకుండా కామాంధుల చేతుల్లో బలవుతున్న తనలాంటి ఎందరో మహిళలను న్యాయం జరగాలని కోరుకుంటోంది. జౌహౌరా ఛాడ దేశ రాజధాని ఉంజుమేను నగరంలో చదువుకుంటోంది. గత ఫిబ్రవరి 8వ తేదీన రోజులాగానే తన స్నేహితురాలితో కలసి ఇంటికి వెళుతుండగా, కారులో వచ్చిన సంపన్న వర్గానికి చెందిన ఐదుగురు యువకులు ఆమెను మెడపట్టి కారులోకి లాక్కున్నారు. అనంతరం నగర శివారులోకి తీసుకెళ్లి నిర్జీవ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేశారు. ఈ సంఘటనపై అంతకు ముందెన్నడూ లేనివిధంగా ఛాడ దేశం భగ్గుమంది. వేలాది మంది యువత వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రదర్శనలు అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు ప్రజా ప్రదర్శనల ఒత్తిడి కారణంగా నిందితులను అరెస్ట్ చేశారు. ఈలోగా జౌహౌరా ఫ్రాన్స్‌లోని బంధువుల ఇంటికి వచ్చింది. ఇక్కడి నుంచే ఆమె తన తదుపరి పోరాటాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కోసమే కాకుండా తన లాంటి బాధితుల కోసం తాను పోరాటాన్ని ప్రారంభించానని తెలిపింది. తన గురించిన పూర్తి వివరాలను వెల్లడించింది. ఫ్రెంచ్ టౌన్ నాన్సీలో నివసించే తన తండ్రి మద్దతుతోనే తాను పోరాటం చేస్తున్నానని చెప్పింది. ‘రేప్ సంఘటనను కుటుంబంలోనే పరిష్కరించుకుందామని మా నాన్న అంటారని భావించాను. అలా అనలేదు. న్యాయం జరిగే వరకు పోరాడమని చెప్పారు. అందుకే ధైర్యంగా ముందుకు వచ్చాను. నా లాగా ఛాడ దేశంలో ఎంతోమంది అమ్మాయిలు రేప్‌లకు గురవుతున్నారు. వారెవరూ ఫిర్యాదు చేయరు. చేసినా ఎవరూ పట్టించుకోరు. వారికి న్యాయం జరగదు. నాపై గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత నేను కూడా పోలీసు వద్దకు వెళ్లాను. ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదు. దురుద్దేశంతో గొప్పవారిపై ఫిర్యాదు చేస్తున్నానని ఆరోపించారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా స్పందించారు. నిందితులను అరెస్ట్ చేశారు. వారికి శిక్ష పడుతుందని నేను భావించడం లేదు. అక్కడి ప్రభుత్వం అలా ఉంది. నిందితులు ఇప్పుడు జైల్లో ఉన్నారని కూడా నేను అనుకోవడం లేదు. అయినా నా పోరాటాన్ని ఆపను. ప్రపంచవ్యాప్తంగా నాకు వస్తున్న మద్దతుతో ముందుకే సాగుతాను. నేరస్థులు గ్యాంగ్‌రేప్‌ను వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టారు. వారిని శిక్షించేందుకు ఆ సాక్ష్యం చాలని నేను అనుకుంటున్నాను. నేరస్థులు ఊహించినట్లుగా సోషల్ మీడియా స్పందించలేదు. నాకే మద్దతుగా నిలిచింది. నా పోరాటానికి మద్దతిస్తున్నవారందరికి రుణపడి ఉంటా’ అని గద్గద స్వరంతో ఆమె మీడియాకు చెప్పింది.