25 నుంచి షా–అలీ–పహిల్వాన్ ఉర్సు
– ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత
అలంపూర్ : ఈ నెల 25వ తేది నుంచి షా–అలీ–పహిల్వాన్ ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కులమతాలకు అతీతంగా ప్రతి ఏడాది నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు దర్గా అభివద్ధి కమిటీ సభ్యులు చైర్మన్ సయ్యద్ షా అహ్మద్ ఒవైసీ ఖాద్రి, కమిటీ అధ్యక్షుడు ఖ్వాజ రుక్ముద్దిన్, ఉపాధ్యాక్షులు షఫీ అహ్మద్, ముక్తార్ బాష, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముజీబ్, కార్యదర్శులు ఎండీ జాఫర్, ఖాసీమ్ మియ్యలు ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్ను కలిసి ఉర్సు ఉత్సవాలకు వసతులు కల్పించాలని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ జయరాముడుకు సైతం ఉర్సు ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ నెల 25వ తేదిన షా–అలీ–పహిల్వాన్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా గంధోత్సవం ఉంటుందని వారు పేర్కొన్నారు. 26వ తేదిన సర్ ముభార్ దర్గాలో చిన్న కిస్తీలు, 27వ తేది ధడ్ ముబారక్ దర్గాలో పెద్ద కిస్తీలు, 28వ తేది మహిళల ప్రత్యేక ఉర్సుతో ఉత్సవాలు ముగియనున్నట్లు వారు పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా భక్తులు తరలి రానుండటంతో అందుకు తగ్గట్టుగా వసతులు కల్పించాలని తహసీల్దార్ మంజులను కలిసి విన్నవించారు.