శతశాతం పోలింగ్‌కు కృషి
విజయనగరం కలెక్టరేట్,న్యూస్‌లైన్ :
ప్రజాస్వామ్యంలోవిలువైన ఓటు హక్కును ప్రతి పౌరుడూ వినియోగించుకునే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. రాజకీయాలపై విసుగు చెంది కొందరు..మనకెందుకు లే అని నిర్లిప్తతతో మరికొందరు ఎన్నికల సమయంలో ఓటుహక్కు వినియోగించుకోని విషయం విదితమే.
అయితే ప్రతి సారీ ఓటుహక్కు వినియోగించుకోని వారి శాతం పెరుగుతుండడంతో అటువంటి వారికి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించాలని ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది. దీనిలోభాగంగా ఓటుహక్కు కలిగిన ప్రతి పౌరుడు ఆ హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు రూపొందిం చాలని అధికారులను ఆదేశించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి జిల్లా, డివిజన్, మండలస్థాయిల్లో ప్ర త్యేక కమిటీలు రూపొందించారు. ఈ కమిటీలకు పలు శాఖలకు చెందిన అధికారులను భాగస్వాములను చేశారు.
కమిటీ చైర్మన్‌గా కలెక్టర్...
శతశాతం ఓటింగ్ కోసం ఏర్పాటైన(స్వీప్) కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ కాంతిలాల్ దండే వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్బి.రామారావు,నోడల్ అదికారిగా స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్ ఎస్.వి.లక్ష్మణమూర్తి నియామకమయ్యారు. మొత్తం పర్యవేక్షణ బాధ్యతలను ఈయన చూస్తారు.
అలాగే విజయనగరం డివిజన్లో ఆర్డీఓ జె.వెంకటరావు,పార్వతీపురం డివిజన్‌కు సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి నియమితులయ్యారు. గిరిజన ప్రాంతా ల్లో కమిటీల పర్యవేక్షణ బాధ్యతలను ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ సైనీ చూస్తారు. నియోజకవర్గస్థాయిలో రిట ర్నింగ్ అధికారులు, మండలస్థాయిలో తహశీల్దార్లు, ఎంపీడీఓలు బాధ్యతలు స్వీకరిస్తారు.
జిల్లావ్యాప్తంగా ఉన్న 34 మండలాల పరిధిలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఉన్న 16,86,017 మందిఓటర్లు ఓటు హక్కు ను వినియోగించుకునే విధంగా ప్రచారకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం గ్రామాల్లో, విద్యాసంస్థల్లో, కర్మాగారాలు ఉన్న ప్రదేశాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. కమిటీలు గురు వారం నుంచే తమ కార్యక్రమాలను అమలు చేశాయి.