chairman position
-
పవర్ కమిషన్ కొత్త చైర్మన్ పై కొనసాగుతున్న సస్పెన్స్
-
టీఆర్ఎస్ ఖాతాలోకే డీసీఎమ్మెస్..
అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవం పంతం నెగ్గించుకున్న తూర్పు ప్రాంత నేతలు ఆదిలాబాద్ అగ్రికల్చర్ : అధికార పార్టీ టీఆర్ఎస్ ఖాతాలో మరో పదవి పడింది. జిల్లా సహకార మార్కెట్ సంఘం చైర్మన్ పదవి కోసం అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గురువారం డీసీఎమ్మెస్ కార్యాలయంలో నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో అధికార పార్టీకి చెందిన కె.శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతనెల 28న అవిశ్వాసం ద్వారా ఖాళీ అయిన చైర్మన్ పదవికి పది మంది డెరైక్టర్ల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. చైర్మన్ పదవి కోసం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఎనిమిది మంది డెరైక్టర్లు పాల్గొనగా ఏడుగురు ఆయనకు మద్దతుగా చేతులు లేపారు. డెరైక్టర్లు బి.వినోద్‌రెడ్డి, బిక్కు రాథోడ్, రాములు, దేవన్న, త్రయంబక్, లాలూనాయక్, దిలిప్ మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినట్లు జిల్లా సహకార అధికారి సూర్యచందర్‌రావు ప్రకటించారు. ఇప్పటివరకు వైస్ చైర్మన్‌గా కొనసాగిన ఆయన రాజీనామా చేసి చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టారు. తూర్పు ప్రాంతానికే పదవి.. కాగా.. డీసీఎమ్మెస్ చైర్మన్ పదవి కోసం పశ్చిమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలే చేశారు. అయినా.. తూర్పు ప్రాంతమైన లక్సెట్టిపేట మండలం జెండావెంకటాపూర్కు చెందిన శ్రీనివాస్‌రెడ్డికే ఆ పదవి లభించింది. ఇతర పార్టీల్లో కొనసాగిన ఆరుగురు డెరైక్టర్లు చైర్మన్ ఎన్నికకు ఒకరోజు ముందు టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఎలాంటి పోటీ లేకుండానే ఏకగీవ్రంగా ముగిసింది. శ్రీనివాస్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన వైస్‌చైర్మన్ పదవికి కమిషనర్ నుంచి ఆదేశాలు రాగానే ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో మళ్లీ ఆ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. డెరైక్టర్ దేవన్న ఇందుకోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ ఎన్నికకు మాజీ చైర్మన్ ఐర నారాయణరెడ్డి, డెరైక్టర్ కోటేశ్వర్రావు హాజరు కాలేదు. అవినితీపై విచారణ చేపడుతాం.. - శ్రీనివాస్‌రెడ్డి, డీసీఎమ్మెస్ చైర్మన్ గత చైర్మన్ అవినితికి పాల్పడడంతోనే అతనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని కొత్తగా చైర్మన్‌గా ఎన్నికైన శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి పశువుల పథకంలో అక్రమాలకు పాల్పడ్డారని, గతంలో ఏ కుంభకోణాలకు పాల్పడ్డారో వాటన్నింటిపై విచారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏళ్ల తరబడి చైర్మన్‌గా కొనసాగుతూ.. రైతులను మోసం చేస్తూ అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. జిల్లాలో రైతులకు ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోలుకు ఎలాం టి ఇబ్బంది కలగకుండా చేస్తానని, తానూ రైతు బిడ్డనేనని, తనకూ రైతుల కష్టాలు తెలుసునని అభిప్రాయపడ్డారు. తదుపరి డెరైక్టర్లు, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, లక్సెట్టిపేట జెడ్పీటీసీ చిన్నయ్య, నాయకులు పాల్గొన్నారు. -
గెలిపించిన పార్టీ పై కూడా విశ్వాసం లేదు
పొదిలి: పదవీ కాంక్షతో, గెలిపించిన పార్టీపై కనీస విశ్వాసం కూడా లేకుండా...ఇంగిత జ్ఞానం లోపించిన ఈదర హరిబాబు చైర్మన్ కుర్చీలో కూర్చున్నారని, జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో గెలిపించిన పార్టీపై కూడా విశ్వాసం లేదు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్ ఆర్డర్‌ను కోర్టు తిరస్కరించింది...అదే చైర్మన్ కుర్చీలో కూర్చోవటానికి ఉత్తర్వుగా భావించి, కూర్చోవడం చిన్నపిల్లల చేష్టగా బాలాజీ అభివ ర్ణించారు. చైర్మన్‌గా హరిబాబు అనర్హుడని తేలిన తరువాత, అధికారుల సూచన మేరకు తాను చైర్మన్ పదవి చేపట్టానని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని, లేదా తననైనా సంప్రదించి పరిస్థితి గురించి అడగాల్సిందన్నారు. ఇవేమీ లేకుండా, నేరుగా కుర్చీలో కూర్చుంటే దాని అర్థం ఏమిటో అవగతం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జెడ్పీ సీఈవో, పంచాయతీ కమిషనర్‌కు లెటర్ పెట్టారు. టీడీపీవారు ఆ ఉత్తర్వులపై డివిజన్ బెంచికి అప్పీల్ చేశారు, ఈవిషయంలో తదుపరి ఆదేశాల కోసం సమాచారం ఇస్తున్నామని లెటర్ పెట్టారు. లీగల్ ఒపీనియన్ అనంతరం దానికి బహుశా సమాధానం వస్తుంది. రెండు మూడు రోజులు వేచి చూసే ఓపిక కూడా లేకపోతే ఎలా’ అని ప్రశ్నించారు. హరిబాబును చైర్మన్‌గిరికి అర్హుడని కోర్టు తేల్చిన మరుక్షణమే కుర్చీ వీడి, అతనికి దండ వేసి మరీ కుర్చీలో కూర్చునపెట్టే నైజం తనకుందని బాలాజీ చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే పదవి తప్ప, అది ఇంక దేనికీ పనికిరాద న్నారు. వైస్ చైర్మన్‌గా ఉండటం తనకు ఇష్టం లేదని, అయితే పార్టీ వ్యూహం మేరకు హరిబాబుకు సపోర్టు చేశామని చెప్పారు. చైర్మన్‌గా అధికారులు ఇచ్చిన ఆర్డర్ ఉంది, కుర్చీ ఉంది.. కారు ఉంది..జెడ్పీ సీఈవోనే బాలాజీనే జెడ్పీ చైర్మన్ అని తేల్చి చెప్పారు కదా అని అన్నారు. సమావేశంలో ఎంపీపీ కె.నరసింహారావు, కోఆప్షన్ సభ్యుడు షేక్.మస్తాన్‌వలి, పార్టీ మండల నాయకుడు వాకా వెంకటరెడ్డి, సర్పంచ్‌లు పి.శ్రీనివాసరావు, పి.ఓంకార్, వార్డు సభ్యులు షేక్.ఖాశీం, నాయకులు పి.బాలయ్య, గుంటూరు పిచ్చిరెడ్డి, టి.నరసారెడ్డి, వెలుగోలు కాశీ తద తరులు పాల్గొన్నారు. -
ఆలయ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ
పెనుగంచిప్రోలు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ పాలకవర్గ చైర్మన్ పదవికి పోటీ రసవత్తరంగా సాగుతోంది. పాలకవర్గం నియామకం కోసం ఈ నెల ఆరోతేదీన దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 20 రోజుల్లో దరఖాస్తులు చేసుకోమని సూచించింది. దరఖాస్తులకు గడువు ఈ నెల 26తో పూర్తికానుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ చైర్మన్ పదవి కోసం నాయకులు ఎవరికివారే ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్, నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకలాపాలు చూస్తున్న పాటిబండ్ల వెంకట్రావు ద్వారా నాయకులు చైర్మన్ పదవి కోసం కుస్తీలు పడుతున్నారు. పదవి కోసం యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏలూరి శివాజీ, అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వాసిరెడ్డి బెనర్జీ ప్రధానంగా పోటీలో ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం వాసిరెడ్డికి చైర్మన్ పదవి ఇస్తే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటామని ఎంపీ ముందు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శివాజీ జోరుగా తన ప్రయత్నాలు చేస్తున్నారు. పదేళ్లుగా యూత్ కాంగ్రెస్‌లో ఉంటూ పలు కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా యువజన కాంగ్రెస్‌లో గుర్తింపు పొందిన తనకు చైర్మన్ పదవి తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఎంపీ హామీ ఇచ్చారని, తనకే చైర్మన్ పదవి వస్తుందని వాసిరెడ్డి చెబుతున్నారు. కాకాని ప్రయత్నాలు... మరోవైపు గత ంలో పాలకవర్గ చైర్మన్‌గా పనిచేసిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాకాని శ్రీనివాసరావు కూడా తనకు తిరిగి చైర్మన్ పదవి కావాలని అడుగుతున్నారు. తనకు పదవి తప్పక వస్తుందని, రెండోసారి ఇవ్వని పక్షంలో పెనుగంచిప్రోలుకు చెందినవారికే కేటాయించాలని కోరుతున్నారు. తన మద్దతుదారుల పేరును ఆయన సూచిస్తున్నారు. యువజన కాంగ్రెస్ నాయకుడు లగడపాటి శంకర్ కూడా ఎంపీ ద్వారా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మొత్తం మీద పదవిపై ఆశ పెట్టుకున్న నేతలంతా ఎవరికివారే తామే చైర్మన్ అవుతామనే ఆలోచనతో ఉన్నారు. తిరుపతమ్మ అమ్మవారి చైర్మన్ పదవి మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.