ఏపీఎస్సీ చైర్మన్ అరెస్ట్
గువాహటి: ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీఎస్సీ) చైర్మన్ రాకేశ్ కుమార్ పాల్ ను శుక్రవారం సీబీఐ అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ అక్రమార్కుల పనిపడతానని గతంలోనే ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సోనోవాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీఎస్సీ చైర్మన్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
గడిచిన కొన్నేళ్లుగా ఏపీఎస్సీ చైర్మన్గా కొనసాగుతోన్న రాకేశ్ కుమార్.. కమిషన్ ద్వారా చేపట్టిన నియామకాల్లో తీవ్ర అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఈ నాటివికావు. రెండేళ్ల కిందటే ఆయనపై సీబీఐ దర్యాప్తునకు అసోం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే మధ్యలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.