గుడిలో లింగాన్నీ ఎత్తుకెళ్లారు..!
గుప్త నిధుల కోసమేనని అనుమానం
కొందుర్గు, న్యూస్‌లైన్ : గుడినేకాదు.. గుళ్లోని లింగాన్నీ మింగేస్తారనే సామెత నిజం చేసి చూపించారు కొందరు దొంగలు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం రావిర్యాలలో సామెతకు ఆచరణ రూపమిచ్చి ఔరా.. అనిపించారు. పోలీసుల కథనం మేరకు .. గ్రామశివారులో ఉన్న సోమలింగేశ్వరస్వామి ఆలయంలో దుండగులు శివలింగాన్నే దొంగిలించేశారు. ఈ ఆలయంలో ప్రతిసోమవారం ప్రత్యేక పూజలు జరుగుతారుు.
ఎప్పటిలాగే పూజ చేయడానికి ఆలయూనికి వెళ్లిన భక్తులు శివలింగం కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. విషయం దేవాలయ ట్రస్ట్ చైర్మన్ ప్రభులింగంకు సమాచారం అందించారు. ఆయన విషయూన్ని పోలీసులకు చెప్పగా ఏఎస్ఐ కృష్ణయ్య సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించారు. ఆలయం వెలుపలగల స్వామివారి పాదాలను కూడా పెకిలించడంతో గుప్తనిధుల కోసం ఇలా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. కేసు దర్యాప్తులో ఉంది.