అమరావతిని హైదరాబాదుగా మార్చొద్దు
అడ్డగోలు నిర్మాణాలకు ‘రాజధాని’గా చేయొద్దని హైకోర్టు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘‘అడ్డగోలు అక్రమ నిర్మాణాలతో హైదరాబాద్ తన శోభను కోల్పోయింది. ఒక నిర్దిష్ట ప్రణాళికంటూ లేకుండా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు కొత్త రాజధాని ప్రాంతం అమరావతిని మరో హైదరాబాద్‌గా చేయవద్దు. అడ్డగోలు నిర్మాణాలకు దానిని రాజధానిగా మార్చొద్దు. అక్రమ నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించండి. కొత్త రాజధాని విషయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని ఉండేలా చూడండి’’ అని ఉమ్మడి హైకోర్టు సీఆర్డీఏ అధికారులకు సూచించింది.
ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్, న్యూజిలాండ్ తదితర దేశాలు మన పిల్లల్ని అక్కడకు రానివ్వడం లేదని, కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడి ప్రాంతాలను ఆ ఆదేశాల స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.