వశపరుచుకుంటే...
భయం లేదు... భక్తి లేదు... ఓ వ్యక్తిని ఏం చేయకుండా అతణ్ణి కంట్రోల్ చేసే పవర్ మనుషులకు వస్తే ఏం జరుగుతుంది? అనే కథతో రూపొందిన సినిమా ‘వశం’. ఐఐటి గ్రాడ్యుయేట్ చల్లా శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. ఐఐటి ఐఎస్ఎమ్డి, ఐఐఎమ్బిలలో చదివిన పలువురు విద్యార్థులు కలసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అన్నమాట. వాసుదేవ్ రావు, శ్వేతా వర్మ జంటగా నటించిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు.
చల్లా శ్రీకాంత్ మాట్లాడుతూ –‘‘రెండొందల ఏళ్ల క్రితం విమానాల్లో మనుషులు ప్రయాణించొచ్చని, కరెంట్‌తో బల్బ్ వెలిగించొచ్చని చెబితే మ్యాజిక్ అనే వారు. ఇప్పుడు పర్టిక్యులర్ యోగా, విభిన్నమైన సంగీతం, కొన్ని కెమికల్స్‌తో ఎదుటివ్యక్తి మైండ్‌ను కంట్రోల్ చేయొచ్చని చెబితే మ్యాజిక్ అంటారు. కరెంట్‌ను కనిపెట్టినప్పుడు.. నేను చెప్పేది కూడా సాధ్యం కావొచ్చు కదా. అది సాధ్యమైతే ఎలా ఉంటుందనేది ఈ చిత్రకథ’’ అన్నారు.