జవానుకు గుండెపోటు.. విమానంలో తరలింపు
హైదరాబాద్: ఛత్తీస్గఢ్లో శిక్షణ పొందుతున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తీవ్ర అనారోగ్యానికి గురికావటంతో హైదరాబాద్కు విమానంలో తరలిస్తున్నారు. కానిస్టేబుల్ చలమయ్య మంగళవారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే స్పందించిన అధికారులు అతడిని భద్రాచలం తరలించి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తీసుకువచ్చారు. బేగంపేట ఎయిర్పోర్టుకు ఆ విమానం చేరుకోనుంది. అక్కడినుంచి ఆ వెంటనే చలమయ్యను కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించనున్నట్లు సమాచారం.