Chalk piece
-
వెరైటీ వినాయకుడు..
సాక్షి, కవిటి: శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంగా బొరివంకలో శ్రీబాలగణపతి ఉద్దానం యూత్ క్లబ్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా లేఖినీరూప కాణిపాక గణపతిని రూపొందించారు. గత ఏడేళ్లుగా పర్యావరణానికి హాని చేయని రీతిలో గణనాథుని విగ్రహాల తయారీలో అందివేసిన చెయ్యిగా పేరు తెచ్చుకున్న ఉద్దానం యూత్ క్లబ్ సభ్యుడు, శిల్పి భైరి తిరుపతిరావు ఈ విగ్రహాన్ని రూపొందించారు. 3,500 సుద్దముక్కలను తీసుకుని ప్రతీ సుద్ద ముక్కపై గణనాథుడిని చెక్కాడు. వీటిని మట్టితో చేసిన గణనాథుడి శరీర ఉపరితలంపై అందంగా అలంకరించాడు. వాటికి ప్రకృతి సిద్ధమైన రంగులను అద్ది ఆకర్షణీయంగా సిద్ధం చేశాడు. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ వరి నారు, నారికేళ, నలుగుపిండి, వనమూలిక, గోధుమ నారు, కొబ్బరిపూలతో వివిధ రూపాల్లో గణేశుని విగ్రహాలను తయారు చేశారు. వీటికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కడం విశేషం. ఫోటోలు ‘సాక్షి’కి పంపండి... నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము www.sakshi.com వెబ్ సైట్లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం. -
సుద్దముక్కపై ‘హరిత’ నినాదం
‘అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం’ అన్నాడో కవి. ఇదే తరహాలో మరిపెడ మండలంలోని అబ్బాయిపాలేనికి చెందిన అనుముల హరినాథ్, ఉమ దంపతుల కుమారుడు నరేష్ కళా హృదయంతో స్పందించాడు. తనలోని సృజనాత్మకతను చాటుకునేందుకు సుద్దముక్కలపై హరితహారం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు రాశాడు. – మరిపెడ -
బాటిల్స్ విత్ థీమ్స్
కళాత్మక దృష్టి ఉంటే కనిపించే ప్రతి వస్తువును కళాకృతిగా మార్చేయవచ్చు. సుద్దముక్కతో కళాఖండాలు తీర్చిదిద్దవచ్చు. సబ్బుబిళ్లలతో అబ్బురపరిచే అందాలను తయారు చేయవచ్చు. సునిశిత పనితనంతో సున్నితత్వంలోనే మెరుపులు సృష్టించవచ్చు. అలాంటి జిజ్ఞాసతోనే ఓ వనిత గాజుసీసాలను మణిరత్నాల్లా మార్చేసింది. కొత్తదనం కోరుకునే వారికి అంతే కొత్తగా ఏదైనా చేయాలనే తపన ఉంటుంది. ఆ తపనే సునందను హ్యాండ్‌మేడ్ కళాకారిణిగా తీర్చిదిద్దింది. చిన్న చిన్న సీసాలు, వాటర్ బాటిల్స్, ల్యాంప్స్.. ఇవే ఆమె ముడిసరుకు. వేళ్లు కూడా సరిగా దూరని సీసాల్లోనికి ఆమె సృజన ప్రవేశిస్తుంది. అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. మెరిసే సీసాలు.. రకరకాల గాజు సీసాలు సునంద చేతిలో పడితే చాలు వెలిగిపోతాయి. ఆ సీసాల లోపలి అంచులు ఆమెకు కాన్వాస్‌లా మారిపోతాయి. కుంచె నుంచి జాలువారిన రంగులు గాజుపై నాట్యం చేస్తాయి. క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్లు, హాలీవుడ్ హీరోలు.. ఒకరేమిటి ఫేమస్ పర్సనాలిటీలంతా అందులో బందీలు కావాల్సిందే. రంగులద్దడం పూర్తయిన తర్వాత లోపల ఎల్ఈడీ లైట్లు అమర్చి వాటిని మెరిపిస్తుంది. ఫైర్‌ఫ్లై ఆర్టికల్స్ తయారు చేయడం హాబీగా ఉన్న సునంద మొదట్లో తన దగ్గరి వాళ్లకు ఇవి ప్రజెంట్ చేసేది. స్నేహితుల ప్రోత్సహంతో.. 2013లో హ్యాండ్‌మేడ్ ఆర్టికల్స్‌తో బిజినెస్ మొదలు పెట్టింది. డిఫరెంట్ థీమ్స్‌తో పాటు సునంద తీర్చిదిద్దిన కళాకృతులు ఇప్పుడు ఆన్లైన్లో కూడా హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్నాయి.