సుద్దముక్కపై ‘హరిత’ నినాదం
‘అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం’ అన్నాడో కవి. ఇదే తరహాలో మరిపెడ మండలంలోని అబ్బాయిపాలేనికి చెందిన అనుముల హరినాథ్, ఉమ దంపతుల కుమారుడు నరేష్ కళా హృదయంతో స్పందించాడు. తనలోని సృజనాత్మకతను చాటుకునేందుకు సుద్దముక్కలపై హరితహారం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు రాశాడు.
– మరిపెడ