challenging roles
-
ఆ పాత్ర చేయడానికి భయపడ్డా!
‘‘ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పుడే ఏ ఆర్టిస్ట్‌కైనా సంతృప్తి లభిస్తుంది. అందుకే ‘రుద్ర’ వెబ్ సిరీస్‌లో నాది కాస్త నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయినప్పటికీ చేశాను’’ అన్నారు రాశీ ఖన్నా. అయితే ఈ క్యారెక్టర్ ఒప్పుకునే ముందు ఈ బ్యూటీ భయపడ్డారట. ఈ విషయం గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘సినిమాల్లో నన్ను పాజిటివ్ రోల్స్‌లో చూసిన ఫ్యాన్స్ నెగటివ్ షేడ్స్‌లో చూసి ఫీలవుతారేమోనని కాస్త భయపడ్డాను. నా మీద ఎంతో అభిమానం చూపిస్తున్న ఫ్యాన్స్‌కి నేను ఆన్సరబుల్. సౌత్‌లో నాకు పాజిటివ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఇక్కడివారు ఎలా రియాక్ట్ అవుతారో అని కొంచెం డౌట్ ఉండేది. కానీ ఆర్టిస్ట్‌గా చాలెంజింగ్ రోల్స్ చేయాలి కాబట్టి నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి ‘రుద్ర’ చేశాను. నా క్యారెక్టర్ చాలామందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు. నచ్చక పోవడానికి కారణం నా మీద వారికున్న పాజిటివ్ ఇమేజ్. ఏది ఏమైనా నాకు ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడూ కావాలి. ఎందుకంటే ఒక యాక్టర్‌గా నేను డిఫరెంట్‌గా ట్రై చేసినప్పుడు వాళ్లు చూస్తేనే నేను మళ్లీ మళ్లీ అలాంటివి చేయగలుగుతాను. లేకపోతే ఒకే తరహా రోల్స్‌కి పరిమితం కావాల్సి వస్తుంది’’ అన్నారు. -
అవి ఉంటేనే మజా!
‘‘ఒకే తరహా పాత్రలు చేయడం నాకిష్టం లేదు. నటిగా వీలైనంత విభిన్నతను చూపించాలనుంది’’ అన్నారు జాన్వీ కపూర్. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాల వయసున్న నటి. ‘ధడక్’తో బాలీవుడ్‌కి పరిచయం అయ్యారామె. ఆ తర్వాత ‘కార్గిల్ గాళ్’ అనే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేశారు. ప్రస్తుతం తమిళ చిత్రం ‘కోకో’ హిందీ రీమేక్ ‘గుడ్ లక్ జెర్రీ’లో నటిస్తున్నారామె. నటిగా ఎలాంటి సినిమాలు చేయాలనుందనే విషయం గురించి జాన్వీ మాట్లాడుతూ– ‘‘నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే పాత్రల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నటిగా నన్ను ఛాలెంజ్ చేసే కథల్లో కనిపించాలని అనుకుంటున్నాను. నాకు సవాళ్లు కావాలి. అప్పుడే మజా ఉంటుంది. నా మొదటి రెండు సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. నటిగా నాకెంత సామర్థ్యం ఉందో తదుపరి సినిమాల ద్వారా చూపించాలనుకుంటున్నాను’’ అన్నారు. ‘గుడ్ లక్ జెర్రీ’, దోస్తానా 2, రూహీ అఫ్జా, తక్త్’ సినిమాలు చేస్తున్నారు జాన్వీ కపూర్. -
మేము సిద్ధమే అంటున్న హీరోయిన్స్
కథానాయికలంటే గ్లామర్‌కి మాత్రమే.. పాటల్లో కలర్ఫుల్గా కనిపించడానికే... సినిమాల్లో నాయికలకు సీన్లు ఉన్నా కథలో పెద్దంత సీన్ ఉండదు. అందుకే... కథతో పాటుగా ప్రయాణించే పాత్రలు ఇవ్వండి. ఛాలెంజింగ్ పాత్రలు రాయండి.. చాలెంజ్‌లు విసరండి. మేము సిద్ధమే అంటున్నారు కథానాయికలు. ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకుంటున్నారు. ఆ పాత్రలను ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నారు. వాళ్ల స్టోరీ ఏంటో చూద్దాం. కాజల్ అగర్వాల్ ఇప్పటివరకూ చాలా రకాల పాత్రలు చేశారు. కానీ తొలిసారి వయసుకు మించిన పాత్రను చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో కాజల్ 80 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కళరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నారు. కాజల్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా పాల్గొంటారని సమాచారం. అంటే.. యంగ్ ఏజ్, ఓల్డేజ్ ఏజ్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోసం పల్లెటూరి అమ్మాయిగా మారిపోయారు రకుల్ ప్రీత్‌సింగ్. ఈ సినిమాలో రకుల్ పాత్ర డీ గ్లామరైజ్డ్గా ఉంటుంది కూడా. అంటే మేకప్ లేకుండా కనిపించనున్నారు. ఈ సినిమాలో రకుల్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక శ్రియను మనందరం ఇప్పటి వరకూ అన్నీ పాజిటివ్ పాత్రల్లోనే చూశాం. తనలోని విలన్ని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నెగటివ్ యాంగిల్‌ను చూపించడానికి రెడీ అవుతున్నారు. హిందీ చిత్రం ‘అంధాధూన్’ తెలుగులో రీమేక్ కాబోతోంది. ఇందులో నితిన్ హీరో. ఈ సినిమాలో విలన్ పాత్రలో శ్రియ నటించనున్నారని టాక్. ‘సీటీ మార్’ చిత్రం కోసం కబడ్డీ కోచ్‌గా మారారు తమన్నా. కోచ్ ఎలా ఉండాలి? ఫిట్నెస్, బాడీ లాంగ్వేజ్ వంటి విషయాల మీద శ్రద్ధ పెట్టి ఈ పాత్ర చేస్తున్నారు తమన్నా. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ హీరో. ‘మూకుత్తి అమ్మన్’ అనే తమిళ చిత్రంలో అమ్మవారిగా కనిపించనున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ పాత్ర చేస్తున్నన్ని రోజులు నియమ నిష్టలతో ఉన్నారట. మాంసాహారం ముట్టుకోలేదు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. పరుగుల రాణిగా మారబోతున్నారు తాప్సీ. ‘రాకెట్ రష్మి’ అనే చిత్రంలో అథ్లెట్‌గా నటిస్తున్నారామె. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ చిత్రం. ఈ పాత్ర కోసం డైట్ మార్చేశారు. వ్యాయామాలు చేస్తూ, రన్నింగ్ మీద దృష్టి పెట్టారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో రష్మికా మందన్నా గ్రామీణ యువతిగా కనిపిస్తారట. అలానే చిత్తూరు యాసలో సంభాషణలు పలకనున్నారు. ఆల్రెడీ చిత్తూరు యాసను ప్రాక్టీస్ చేయడంతోపాటు గ్రామీణ యువతి హావభావాలను నేర్చుకుంటున్నారట. సమంత ఇటీవలే ఓ కొత్త దర్శకుడి సినిమాలో నటించడానికి అంగీకరించారట. ఈ సినిమాలో ఆమె మూగ మరియు చెవిటి అమ్మాయిగా కనిపించనున్నారు. ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని టాక్. ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో ఆయనకు జోడీగా నటిస్తున్నారు పూజా హెగ్డే. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రెండు పాత్రలకు మధ్య వ్యత్యాసం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట పూజా హెగ్డే. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర చేస్తున్నారు కంగనా రనౌత్. ‘తలైవి’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇలా కొత్త పాత్రలు విసురుతున్న సవాల్‌ను స్వీకరించి శారీరకంగా లేదా మానసిక శ్రమను ఇష్టంగా తీసుకుంటున్నారు నాయికలు. ఇలాంటి చాన్స్‌లు అరుదుగా వస్తాయి కాబట్టి నిరూపించుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. శభాష్ అనిపించుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
అందాల ఆరబోత చాలు
నేను మాత్రం ఎంతకాలమని అందాలారబోతనే నమ్ముకుంటాను? ఇప్పటి వరకు గ్లామర్ డాల్‌గా అందాలు ఒలకబోసింది చాలు. ఇకపై చాలెంజింగ్ పాత్రలే నటిస్తాను అంటున్నదెవరో తెలుసా? నాజూకు భామ శ్రీయ. ఈ బ్యూటీలో మంచి నటి ఉన్న విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎందుకనో శ్రీయను ఎక్కువగా గ్లామరస్ హీరోయిన్‌గానే చూపించడానికి దక్షిణాది దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపించారు. కచ్చితమైన కొలతలతో కూడిన ఆమె శారీరక సౌష్టం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి యువ స్టార్స్ విజయ్, ధనుష్ వరకు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నుంచి క్రేజీ స్టార్స్ బాలకృష్ణ, నాగార్జున వరకు జత కట్టిన ఈ ముద్దుగుమ్మ కొందరు తారలను అనుకరించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ముఖ్యంగా నటి అనుష్క వేదం చిత్రంలో వేశ్యపాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీయా కూడా అదే బాటలో పయనించి పవిత్ర అనే చిత్రంలో వెలయాలి పాత్ర పోషించారు. కానీ ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అదే విధంగా కన్నడంలో చంద్ర అనే చిత్రంలో పవర్ఫుల్ పాత్రను పోషించారు. ఆ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీంతో పునరాలోచనలో పడిన శ్రీయ ఇకపై రెగ్యులర్ పాత్రలు, ముఖ్యంగా గ్లామర్ పాత్రలు పోషించరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీయ వల్ల సాధ్యం కాదని అనుకునే సవాల్‌తో కూడిన పాత్రలను పోషించి నటిగా తానేమిటో నిరూపించుకుంటానంటున్నారు. ఇందుకోసం చిత్రానికి 50 నుంచి 60 కాల్షీట్స్ కేటాయించి అయినా ఆ పాత్రగా మారడానికి ప్రయత్నిస్తానన్నారు. ఇకపై అలాంటి పాత్రలతో కూడిన చిత్రాలనే అంగీకరిస్తానని చెప్పారు. షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు ఈ రోజు బాగా నటించానన్న మంచి అనుభూతి తనకు కలగాలన్నారు. రాత్రులు సుఖ నిద్రకలగాలని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో నాగార్జున హీరోగా నటించిన మనం చిత్రంలో ముఖ్య పాత్రను పోషించానన్నారు. హిందీలో జాకీష్రాఫ్ సరసన ఒక చిత్రంలో నటిస్తున్నట్లు శ్రీయ వెల్లడించారు. -
అందాల ఆరబోత చాలు
నేను మాత్రం ఎంతకాలమని అందాలారబోతనే నమ్ముకుంటాను? ఇప్పటి వరకు గ్లామర్ డాల్‌గా అందాలు ఒలకబోసింది చాలు. ఇకపై చాలెంజింగ్ పాత్రలే నటిస్తాను అంటున్నదెవరో తెలుసా? నాజూకు భామ శ్రీయ. ఈ బ్యూటీలో మంచి నటి ఉన్న విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎందుకనో శ్రీయను ఎక్కువగా గ్లామరస్ హీరోయిన్‌గానే చూపించడానికి దక్షిణాది దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపించారు. కచ్చితమైన కొలతలతో కూడిన ఆమె శారీరక సౌష్టం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి యువ స్టార్స్ విజయ్, ధనుష్ వరకు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నుంచి క్రేజీ స్టార్స్ బాలకృష్ణ, నాగార్జున వరకు జత కట్టిన ఈ ముద్దుగుమ్మ కొందరు తారలను అనుకరించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ముఖ్యంగా నటి అనుష్క వేదం చిత్రంలో వేశ్యపాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీయా కూడా అదే బాటలో పయనించి పవిత్ర అనే చిత్రంలో వెలయాలి పాత్ర పోషించారు. కానీ ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అదే విధంగా కన్నడంలో చంద్ర అనే చిత్రంలో పవర్ఫుల్ పాత్రను పోషించారు. ఆ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీంతో పునరాలోచనలో పడిన శ్రీయ ఇకపై రెగ్యులర్ పాత్రలు, ముఖ్యంగా గ్లామర్ పాత్రలు పోషించరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీయ వల్ల సాధ్యం కాదని అనుకునే సవాల్‌తో కూడిన పాత్రలను పోషించి నటిగా తానేమిటో నిరూపించుకుంటానంటున్నారు. ఇందుకోసం చిత్రానికి 50 నుంచి 60 కాల్షీట్స్ కేటాయించి అయినా ఆ పాత్రగా మారడానికి ప్రయత్నిస్తానన్నారు. ఇకపై అలాంటి పాత్రలతో కూడిన చిత్రాలనే అంగీకరిస్తానని చెప్పారు. షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు ఈ రోజు బాగా నటించానన్న మంచి అనుభూతి తనకు కలగాలన్నారు. రాత్రులు సుఖ నిద్రకలగాలని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో నాగార్జున హీరోగా నటించిన మనం చిత్రంలో ముఖ్య పాత్రను పోషించానన్నారు. హిందీలో జాకీష్రాఫ్ సరసన ఒక చిత్రంలో నటిస్తున్నట్లు శ్రీయ వెల్లడించారు.