breaking news
chamala kiran kumar reddy
-
‘ఆ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా’
ఢిల్లీ: బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తుననానని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణకుమార్రెడ్డి స్పష్టం చేశారు. పోలీస్ అధికారిగా ఉండి, తన తోటి పోలీసు చేస్తున్న విధులను కించపరిచేలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. ‘గత ప్రభుత్వంలో డ్రగ్ కేసులు కాలేదు, విచ్చల విడిగా డ్రగ్స్ ఉపయోగించారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు బీఎస్పీ నేతగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడింది మర్చి పోయారా?, అప్పట్లో డ్రగ్స్ స్వేచ్చగా దొరుకుతున్నాయంటూ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఇపుడు పార్టీ మారాక బిఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ చేస్తున్నారు. సీఎంగా రేవంత్ బాధ్యత తీసుకున్నాక, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారు. మీరు యదేచ్చగా వదిలి పెట్టిన వాళ్లపై కేసులు పెడుతున్నాం. తెలంగాణ ప్రజలను ప్రవీణ్ కుమార్ తప్పు దోవ పట్టిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
‘SIR పేరుతో ఈసీ చేస్తున్న దారుణాన్ని మేము ప్రశ్నించాం’
హైదరాబాద్: ‘SIR’(స్పెషల్ ఇంటిన్స్‌వ్ రివ్యూ) పేరుతో భారత ఎన్నికల సంఘం చేస్తున్న దారుణాన్ని తాము ప్రశ్నించామని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేల 65 లక్షలు ఓటర్లను తొలిగించినట్లయితే ఎందుకు తీసేస్తున్నారో వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘ సుప్రీం కోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ...తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో గడిచిన రెండు వారాలుగా పార్లమెంటు సభ్యులం....ఈ స్పెషల్ ఇంటిన్స్‌వ్ రివ్యూపై పార్లమెంటులో చర్చ జరగాలని పట్టుపడుతూ వస్తున్నాం. స్పీకర్ ఈ విషయంపై దృష్టి పెట్టకుండా సభను వాయిదా వేస్తూ వచ్చారు.ఇవాళ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో....మనం ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం అనేది ఒక కీలకమైన విభాగం. రాజ్యాంగ బద్దంగా స్వతంత్రంగా పని చేయాల్సిన ఈ సంస్థ ప్రలోభాలకు లోనైతే తీరని నష్టం వాటిల్లుతుంది. పౌరసత్వం, మతం పేరున ఎన్నికల సంఘం ఓటర్లను తొలిగించలేదు. ఒకవేల ఓటర్లను తొలిగించాలంటే ఎందుకు తొలిగించారో...చెప్పాల్సి ఉంటుంది. రాహుల్ ఇటీవల ఇచ్చిన ప్రజంటేషన్ ద్వారా ఓటర్ల జాబితాలో లోపాలు సుస్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటకలో చనిపోయిన వారిని బతికి ఉన్నట్లు, బతికి ఉన్న వారు చనిపోయినట్లు తప్పులు తడకలుగా జాబితా ఉంది. భారత్‌లో ఎన్నికల సంఘం చాలా స్పష్టతతో న్యూట్రల్‌గా పని చేయాల్సి ఉంది. సుప్రీం కోర్టు ఇవాళ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఈ విషయాన్ని స్పష్ఠం చేస్తున్నాయి.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తామంతా సంతోషిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం మనందరిపై ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. -
‘నేను జైల్లో ఉన్నప్పుడు మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ వచ్చి..’
హైదరాబాద్: కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కౌంటర్లకు రీ కౌంటర్లు అన్నట్లు ఇరు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ-కాంగ్రెస్‌లు కలిసి కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్న బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా బీఆర్ఎస్పై మండిపడ్డారు. ‘ నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ రావు ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా! అని వాళ్లకు చెప్పాను.సుమారు నాలుగైదు నెలల క్రితం జాగృతి కవిత ఈ breaking news ను ఈ రాష్ట్రంలో తనకు సన్నిహితులైన దాదాపు అన్నీ ఛానెళ్ల, పత్రికల ప్రతినిధులకు రకరకాల రూపంలో స్వయంగా లీక్ ఇచ్చింది. పాపం ఆవిడ breaking ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేదు. సింగిల్ కాలం వార్త కూడా వేయలేదు.ఆ తర్వాత ఆమె రాసిన లేఖ లీకు అందిరికీ తెలిసిన విషయమే’ అంటూ పోస్ట్ పెట్టారు ఎంపీ చామల. “నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్…మా బావ హరీష్ రావు… ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. “మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా!” అని వాళ్లకు చెప్పాను. సుమారు నాలుగైదు… pic.twitter.com/38Qrgs6NoE— Kiran Kumar Chamala (@kiran_chamala) July 26, 2025 -
కొలనుపాక సోమేశ్వరునికి మహర్దశ
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో అతి పురాతనమైన కొలనుపాకలోని శైవ, జైన దేవాలయాల ప్రాంతాలకు మహర్దశ కలగనుంది. ఈ క్షేత్రాన్ని కేంద్రం స్వదేశీ దర్శన్ ప్రసాద్ 2.0 (తీర్థయాత్ర పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్) పథకంలో చేర్చనుంది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంగీకారం తెలిపారు. తెలంగాణలోని బౌద్ధ ప్రాంతాలను సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నాగార్జునసాగర్‌ల అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టింది. ప్రసాద్ పథకంలో అభివృద్ధి చేయాలని.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో చారిత్రక ప్రాధాన్యమున్న శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం ఉంది. దీన్ని అభివృద్ధి చేస్తూ సంరక్షించడానికి అవసరమైన నిధులను పీఆర్ఏఎస్ఏడీ 2.0 (ప్రసాద్ 2.0) పథకం కింద విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి కోరారు. కొలనుపాకకు చారిత్రక ప్రాధాన్యం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం కల్యాణ చాళుక్యుల కాలం (7 – 10వ శతాబ్దం) నాటి ప్రాచీన శైవ ఆలయం. చాళుక్యుల అనంతరం కాకతీయుల కాలంలో (12వ – 13వ శతాబ్దం) అత్యంత ప్రాధాన్యమున్న శైవ క్షేత్రంగా చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. ఈ ఆలయం చాళుక్య శిల్పకళా నైపుణ్యం, కాకతీయుల శిల్ప సౌందర్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఉజ్జయినీ జగద్గురు శ్రీ సిద్ధలింగ రాజదేశి కేంద్ర శివాచార్య స్వామీజీ ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.ఎక్కడ ఉందంటే.. కొలనుపాక ఆలయం జాతీయ రహదారి 163 (హైదరాబాద్–వరంగల్ మార్గం)లో ఉంది. సికింద్రాబాద్–కాజీపేట రైల్వే మార్గంలో.. ఆలేరుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏటా వేలా ది మంది భక్తులు, పర్యాటకులు దేశ విదేశాల నుంచి తరలివచ్చి ఆలయాన్ని శ్రీ చండికాంబ సహిత సోమేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ప్రతి శివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ప్రాచీన విగ్ర హాలు, కాకతీయుల చరిత్రను తెలిపే శాసనాల (శిలాశాస నాలు)తో రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియం ఉంది.మఠాలకు నెలవు కొలనుపాక గ్రామంలో అనేక సామాజిక ఆదారిత మఠాలను ని ర్మించారు. ఈ ప్రాంతం మతపరమైన ప్రా« దాన్యాన్ని మరింతగా పెంచింది. కులాల వా రీగా ఉన్న మఠాలతో సోమేశ్వర ఆలయ ప్రాంగణం గొప్ప శివ క్షేత్రంగా పేరొందింది.శివలింగ రూపంలో దర్శనం శతాబ్దాలుగా ప్రముఖ శైవ క్షేత్రంగా కొలనుపాక గ్రామం పేరొందింది. సోమేశ్వర స్వామి శివలింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. నిత్యం ఆలయంలో ధూప, దీప, నైవేద్యాలు, శాస్త్రోక్తంగా పూజలు జరుగుతాయి. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలో 2000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్వేతాంబర జైన దేవాలయం ఉంది. జైన తీర్థంకరులు ఈ దేవాలయంటో ఉన్నారు. రోజూ వేలాది మంది జైనులతోపాటు ఇతర మతస్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. మౌలిక సదుపాయల లేమి ప్రాధాన్యమున్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి మౌలిక సదుపాయాల లేమి ఉంది. సదుపాయాల కల్పన, పర్యాటక అభివృద్ధికి నిధుల కొరత ఉంది. ప్రధానంగా ఆలయంలో ఎన్నో విశిష్టమైన శిల్పకళా, శాసనాలు ఆలనా పాలనా లేకుండా పడిఉన్నాయి. వాటిని పునరుద్ధరించాలి. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, రోడ్లు, వసతి, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ఆలయ పరిసరాల సుందరీకరణ, విద్యుత్ వెలుగులు, పార్కులు, ఆలయ విశిష్టతను తెలిపే మార్గదర్శక ఫలకాలను ఏర్పాటు చేయాలి. తెలంగాణలోని ఇతర వారసత్వ ప్రాంతాలతో కలిపి కొలనుపాకను.. మతపరమైన, సాంస్కృతిక పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలి. గ్రామానికి వచ్చే సందర్శకుల్లో సాంస్కృతిక అవగాహన పెంచేందుకు మ్యూజియాన్ని డిజిటలైజేషన్ చేయాలి. ఇందుకోసం ఈ చారిత్రక యాత్రాక్షేత్రం పునరుజ్జీవానికి.. ప్రసాద్ 2.0 పథకం కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ చామల కోరారు. కొలనుపాకకు కేంద్రం నిధులు ప్రసాద్ 2.0 పథకంలో కొలనుపాకను చేర్చడానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంగీకరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిస్తాం. కొలనుపాక దేవాలయాల అభివృద్ధి, వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని మే నెలలో లేఖను అందజేశాను. కొలనుపాక దేవాలయాల అభివృద్ధికి కేంద్రం ప్రతిపాదనలు కోరింది. సోమేశ్వరాలయానికి, కర్ణాటక ప్రభుత్వానికి మధ్య సాంకేతిక సమస్యలను తెలుసుకుని వాటిని కూడా పరిష్కరిస్తాం. – చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ భువనగిరిచదవండి: శతాబ్దాల చరిత్ర ఆదరణ లేక దీనావస్థ -
‘బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఫిక్సింగ్‌లో భాగమే’
ఢిల్లీ : తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం బీజేపీ-బీఆర్ఎస్ల మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి. బీజేపీ-బీఆర్ఎస్లు మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఉన్నాయనే విషయం దీని ద్వారా నిరూపితమైందంటూ సెటైర్లు వేశారు. ఈరోజు(సోమవారం, జూన్ 30) ఢిల్లీ నుంచి మాట్లాడిన చామల.. కేసీఆర్ గెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని, అటువంటప్పుడు దోచుకోవడానికి ఏముంటుందని ప్రశ్నించారు కిరణ్‌కుమార్‌రెడ్డి‘మీరు(కేంద్రం) ఏమైనా నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తుంది. బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుపుకోసం బీఆర్ఎస్ చేసింది అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో కూడా ఆ రెండు పార్టీలు అదే రూట్ మ్యాచ్‌తో ముందుకు వెళ్లనున్నాయి. హైదరాబాద్‌లో మెట్రోకు పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కిషన్‌రెడ్డి.. తెలంగాణ, హైదరాబాద్ సమస్యల విషయంలో నోరు విప్పరు. హైదరాబాద్ నగర ప్రజకు కిషన్‌రెడ్డి చేసిందేమిటి?, ఈ ఏడాది కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. విభజన హామీలు నెరవేర్చలేదు. హైదరాబాద్ మెట్రో కోసం ఐదారుసార్లు సీఎం రేవంత్ ఢిల్లీకి వచ్చారు. మనం కట్టిన ట్యాక్సుల్లో మన వాటా వెనక్కి రావడం లేదు. సీఎం రేవంత్ తన ప్రయత్నం తాను చేస్తున్నారు.. కిషన్‌రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచెయ్యాలి’ అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయనే..