చాంపియన్స్ లీగ్ టీ-20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పెర్త్
హైదరాబాద్: హైదరాబాద్‌లో క్రికెట్ సందడి మొదలైంది. చాంపియన్స్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదికైంది. బుధవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో పెర్త్ కెప్టెన్ వోజెస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గౌతమ్ గంభీర్ సారథ్యం వహిస్తున్నాడు.