29 నుంచి సహస్ర చండీయాగం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి సీఎం పదవిని అధిష్టించాలని కోరుతూ.. ఈ నెల 29 నుంచి మహారుద్ర సహిత సహస్ర చండీయాగ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు, ప్రముఖ విద్యావేత్త ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయశారదారెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం హైదరాబాద్లోని లోటస్పాండ్లో ఈ మహోత్సవ ఆహ్వాన పత్రికను జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ... వచ్చే శాసన సభ ఎన్నికల వరకు ప్రతిరోజు మహాన్యాసన పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర చండీపారాయణం, హోమం, మహావిద్యా పారాయణ హోమం, ప్రత్యేంగిర పారాయణ హోమం, మన్యసూక్త పారాయణ శ్రీలక్ష్మీ గణపతి జప హోమం, మహాసుదర్శన యాగం, నవగ్రహ సహిత రుద్రహోమాలు చేస్తున్నామన్నారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు క్రమం తప్పకుండా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వేదపండితులు బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామప్రసాద్ శర్మతో పాటు ఆయన సోదరులు నేతృత్వం వహిస్తారన్నారు. ఈ కార్యక్రమం 2 –4 – 120/1, స్నేహపురికాలనీ, రోడ్ నంబర్ 19, నాగోల్లో జరుగుతుందని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. వివరాలకు 98494 46530లో సంప్రదించవచ్చన్నారు.