తిడితే..బైక్ బుగ్గే
హిమాయత్‌నగర్: ఎవరైనా తిడితే వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి వాహనాలకు నిప్పుపెట్టు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇస్పెక్టర్ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..చంద్రానగర్ బస్తీకి చెందిన మణిభూషణ్(22)ను అతని బాబాయ్ మహేష్ అకారణంగా తిట్టేవాడు. దీనిని మనసులో పెట్టుకున్న మణిభూషణ్ తన స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి మహేష్‌కు చెందిన బైక్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అయితే తనపై అనుమానం రాకుండా ఉండేందుకు సమీపంలో ఉన్న వాహనానికి కూడా నిప్పు పెట్టాడు.
నిందితుడు జనవరిలో కూడా ఓ బైక్‌కు నిప్పుపెట్టినట్లు విచారణలో వెల్లడయ్యింది. బస్తీకి చెందిన పలువురి బైక్‌ల సీట్లను కోయడం లాంటి పనులు చేసినట్లు అంగీకరించాడు. సీసీ కెమెరాల ఆధారంగా 24గంటల్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.