వాలంటైన్స్‌డే వేడుకలు వద్దు: హిందూ మహాసభ
లక్నో: ఈ నెల 14న పాశ్చ్యాత్యులు చేసుకొనే వాలంటైన్స్‌డే(ప్రేమికుల రోజు) వేడుకలు మనకు వద్దని, ఈ వేడుకల నుంచి యువత దూరంగా ఉండాలని హిందూ మహాసభ పిలుపునిచ్చింది. ప్రేమ పేరుతో ఆరోజు బహిరంగ ప్రదేశాల్లో తిరిగే యువతీ యువకులకు పెళ్లిళ్లు చేస్తామంది. ‘పార్కులు, మాల్స్, చారిత్రక ప్రదేశాల్లో 14న సంచరించే ప్రేమ పక్షుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధం చేశాం. ఈ బృందాలు తమకు పట్టుబడిన వారికి అక్కడికక్కడే పెళ్లిళ్లు చేస్తారు’ అని హిందూ మహాసభ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌశిక్ చెప్పారు.