లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్లేట్ల పంపిణీ
బి.చందుపట్ల(చివ్వెంల) : గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట చేస్తున్న సేవలు అభినందనీయమని మండల విద్యాధికారి కట్టా యల్లారెడ్డి అన్నారు. మంగళవారం సంస్థ ఆధ్వర్యంలో బి.చందుపట్ల ప్రాథమిక పాఠశాలలోని 243 మంది విద్యార్థులకు రూ.20 వేల విలువ చేసే పెన్నులు, పుస్తకాలు, ప్లేట్లు అందజేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ ధరావత్ రతిరాం నాయక్, లయన్స్ క్లబ్ చైర్మన్ బండారి రాజా, సభ్యులు యామా రామ్మూర్తి, భోనగిరి విజయ్‌కుమార్, యాదా కిరణ్, బజ్జూరి శ్రీహరి, ఏనుగుల లింగారెడ్డి, హెచ్ఎం నూకల వెంకట్‌రెడ్డి , ఉపాధ్యాయలు క్రిష్ణ, రవీందర్, పద్మజ, కమల తదితరులు పాల్గొన్నారు,