charecters
-
డిస్నీ క్యారెక్టర్లుగా హాలీవుడ్ సెలబ్రిటీస్ వైరల్ ఫొటోస్
-
ఏంటి లచ్చవ్వ లో ఈ యాంగిల్ కూడా ఉందా..!
-
సత్య నాయికలు
సత్యభామ అంటే.. నిలువెత్తు అహంకారం, పొగరు, మంకుపట్టు.. గారాల భార్యామణి.. ఇవే గుర్తొస్తాయి. వీరోచిత నారీమణిగా ఆమెను దీపావళి నాడు మాత్రమే తలుచుకుంటాం! నిజానికి సత్యభామ నిలువెత్తు ఆత్మస్థయిర్యం, ఆత్మగౌరవం. సడలని పట్టుదల. భర్తతో సమానంగా హోదా తీసుకున్న సహచరి. కష్టాల్లో భర్తకు కొండంత అండగా నిలిచిన జీవిత భాగస్వామి! మహిళలకు సంబంధించినంత వరకు నరకాసుర వధ కాదు దీపావళి. పిరికితనాన్ని కాల్చేసి.. ఆత్మ స్థయిర్యాన్ని వెలిగించుకున్న రోజు! మహిళలంతా సత్యభామగా గౌరవం అందుకున్న వేడుక!! ఇలాంటి సత్యభామలు స్క్రీన్ మీద కూడా కనిపించి మహిళా ప్రేక్షకుల ఆలోచనా కోణాన్నే మార్చేశారు. ‘మిష్టర్ పెళ్లాం’.. గుర్తుంది కదా? బ్యాంక్ ఉద్యోగి అయిన భర్త దొంగతనం నిందతో సస్పెండ్ అవుతాడు. అప్పుడు.. అప్పటి దాకా గృహిణిగా ఉన్న భార్య కుటుంబ పోషణ బాధ్యతను తీసుకొని ఉద్యోగానికి వెళ్తుంది. నైపుణ్యంతో తక్కువ సమయంలోనే పదోన్నతిని, మంచి జీతాన్ని అందుకుంటుంది. ఇంకోవైపు భర్త నిర్దోషి అని రుజువుచేయడానికి తనవంతు ప్రయత్నమూ మొదలుపెట్టి ‘మిష్టర్ పెళ్లాం’ అనిపించుకుంటుంది కథానాయిక ఝాన్సీ (ఆమని). రాధాగోపాళం చూసే ఉంటారు. పురుషాహంకారాన్ని మీసానికి అంటించుకున్న గోపాలానికి చిలిపితనం, సమయస్ఫూర్తి, ప్రజ్ఞాపాటవాలుగల జీవన సహచరి రాధ. గోపాళం (శ్రీకాంత్) పబ్లిక్ ప్రాసిక్యూటర్. రాధ (స్నేహ) కూడా లాయరే. ఇంకా చెప్పాలంటే గోపాలం వాదిస్తున్న ఓ కేసులో డిఫెన్స్ లాయర్. నిజం నిగ్గు తేల్చి భర్తను ఓడిస్తుంది. అహం దెబ్బతిన్న గోపాలం భార్యను వదిలేయాలనుకుంటాడు. అప్పటికి ఆమె గర్భవతి. తను తలదించుకోకుండా.. సాగిల పడకుండా.. భర్త తన తప్పు తెలుసుకునేలా చేస్తుంది రాధ. తప్పొప్పులను సరిదిద్దుకుంటూ నడిస్తేనే దాంపత్యం.. కలిసి ఉంటేనే ఆలుమగలు లేకపోతే ఒక స్త్రీ, ఒక పురుషుడు అని చెప్తుందీ సినిమా. ‘గోరంత దీపం’ ఇంకో సినిమా. భర్తే తండ్రి, గురువు, దైవం అన్నీనూ అనే సుద్దుల సారెతో అత్తారింట్లోకి అడుగుపెడ్తుంది పద్మ (వాణిశ్రీ). భర్త శేషు (శ్రీధర్) బ్యాడ్మింటన్ ఆటగాడు. అత్తగారి (సూర్యకాంతం) ఆరళ్లు షరామామూలే. భార్య ఆత్మగౌరవాన్ని గుర్తించని భర్త ప్రవర్తనా సహజమే ఆ సంసారంలో. అదనంగా పద్మకున్న సమస్య డాక్టర్ మోహన్ (మోహన్ బాబు). భర్త స్నేహితుడు అతను. ఆమె మీద కన్నేసి కబళించాలని ఎప్పటికప్పుడు ఎత్తులు, పన్నాగాలు పన్నుతూంటాడు. అతని గురించి భర్తకు చెప్పినా వినడు. విన్నా నమ్మడు. నమ్మినా స్పందించడు. అప్పుడు తనే సత్యభామ అయి మోహన్‌ను ఎదుర్కొంటుంది. విజయం సాధిస్తుంది. ఇంటికే కాదు జీవితానికే దీపావళి తెచ్చుకుంటుంది. హిందీలో ‘‘తుమ్హారీ సులూ’’ కూడా ఏం తీసిపోదు ఈ సత్యభామ సీక్వెన్స్‌లో. కథానాయిక సులోచనా దూబే (విద్యా బాలన్) చూపిన తెగువా తక్కువేం కాదు. రేడియోలో పాటలు వింటూ .. వాళ్లు పెట్టే క్విజ్‌లో పాల్గొంటూ కాలక్షేపం చేస్తున్న ఆమె ఒకరోజు రేడియో క్విజ్‌లో విజేతవుతుంది. అప్పటికే భర్త తను పనిచేస్తున్న ఫ్యాక్టరీ యజమాని మారి ఇబ్బందులు పడ్తూంటాడు. సులూ తనకు వచ్చిన బహుమతి తీసుకోవడానికి రేడియో స్టేషన్‌కు వెళ్లి అక్కడ లేట్ నైట్ షో అనౌన్సర్‌గా జాబ్ తెచ్చుకుంటుంది. భర్త ఉద్యోగం పోయే స్థితి వస్తుంటే ఆమె ఉద్యోగంలో రాణిస్తూంటుంది. దీంతో తలెత్తిన భర్త ఈగో సమస్యను, కొడుకు క్రమశిక్షణారాహిత్యాన్ని అన్నిటినీ నేర్పుగా చక్కదిద్దుకొని.. చివరకు తను పనిచేసే రేడియోస్టేషన్లోని ఉద్యోగులకు క్యాటరింగ్ సర్వీస్ ఇచ్చేలా భర్తకు కాంట్రాక్టూ ఇప్పిస్తుంది సులోచన దూబే. వర్తమాన ‘సత్య’లు అయితే ఈ సినిమాలకు పురాణ స్త్రీ సత్యభామ స్ఫూర్తి కాదు. వ్యాపారంలో నష్టం వస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుందామని భర్త చతికిలపడితే ఆఖరుసారిగా ఒక్క చాన్స్ తీసుకొని దగ్గరున్న బంగారాన్ని కుదువబెట్టి.. కంపెనీకోసం శ్రమించి రుణంలోంచి బయటపడేసి.. తమను నమ్ముకున్న వాళ్ల జీతాలకు పూచీ ఇచ్చి జీవితాలకు భరోసా కల్పించిన భార్య, ఉన్నది అమ్ముకొని దుబాయ్ వెళ్లి ధిర్హామ్స్లో సంపాదనను ఇంటికి పంపిస్తాననే ధీమా చూపిన మనిషి అనారోగ్యంతో ఇంటికొచ్చి మంచానికి అతుక్కుపోతే ఆయన ఆరోగ్యానికి చికిత్సే కాదు కుటుంబ ఆర్థిక సమస్యల ట్రీట్మెంట్నూ తలకెత్తుకొని ధైర్యంగా జీవనపోరాటం చేస్తున్న ఆ ఇంటి ఇల్లాలు, కష్టాల కడలిలో చిక్కుకున్న ఇంటిని వీడని ధైర్యంతో చక్కబెట్టిన సహధర్మచారిణి.. ఇలాంటి ఇంకెందరో సంసార సమరంలో సొమ్మసిల్లిన భర్తల చేతిలోంచి కుటుంబ రథం పగ్గాలు పట్టి ముందుకు నడిపిస్తున్న వారంతా నిజ జీవితంలోని సత్యభామలే. మహిళాలోకానికి ఎప్పటికీ వారే స్ఫూర్తి.. ప్రేరణ!! -
పాత్రకు మౌల్డ్ అవుతున్నారు
ఒకప్పుడు మేకప్ మీద శ్రద్ధ దక్షిణాదిలో కమలహాసన్‌కే ఉండేది.సాగర సంగమంలో సహజమైన ముసలిరూపం చూపడానికి ఆయన మేకప్ శ్రద్ధే కారణం.భామనే సత్యభామనే, భారతీయుడు సినిమాలతో ఆయనే ప్రోస్థెటిక్ మేకప్‌ను ప్రవేశపెట్టాడు.ఇప్పుడు పాత్రను మౌల్డ్ చేయడానికి ప్రతి ఆర్టిస్ట్ మేకప్నుఆశ్రయిస్తున్నాడు. జనానికి నచ్చుతున్నాడు. సినిమా అంటేనే ట్రిక్కు. ప్రేక్షకుడిని మాయ చేయడానికి ట్రిక్కీగా రకరకాల కథలు అల్లుతారు. రకరకాల పాత్రలు సృష్టిస్తారు. విచిత్రమైనవి. వీరోచితమైనవి. అందమైనవి. అందవిహీనమైనవి. ఈ పాత్రల్లోకి ప్రేక్షకుడిని లీనం చేయడానికి నటులు కొన్నిసార్లు సన్నబడతారు. పాత్ర బరువువైనది అయితే బరువు పెరుగుతారు. కుదరని పక్షంలో ‘ప్రోస్థెటిక్ మేకప్’ సాయం తీసుకుంటున్నారు. థియేటర్లో ప్రేక్షకుడిని సీట్లో నుంచి కదలనీయకుండా కూర్చోబెట్టడం కోసం, గంటల కొద్దీ మేకప్ చైర్లో కూర్చుని శ్రమిస్తున్నారు. ఈ ప్రోస్థెట్రిక్కులను ఉపయోగించే ‘భారతీయుడు’ లో కమల్‌హాసన్ వయసుని అమాంతం ఎనభైకి తీసుకెళ్లగలిగారు. ఈ ట్రిక్కే మొన్న ‘2.0’లో అక్షయ్ కుమార్‌ని పక్షిరాజాలా మార్చింది. ప్రస్తుతం ఈ ‘ప్రోస్థెట్రిక్’తో చాలామంది నటీనటులు విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. ఆ మేకప్ మాయను తెలుసుకుందాం. జయలా ఎలా? జయలలిత చాలా ప్రఖ్యాత నటి, అంతే గొప్ప ప్రజానేత. కంగనా రనౌత్ సమర్థమైన నటి. అందుకే జయ బయోపిక్‌లో ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి తీసుకున్నారు చిత్రనిర్మాత విష్ణు ఇందూరి. అయితే కంగనా ఏ కోశానా జయలా ఉండరు. కొద్దిపాటి ప్రాక్టీస్‌తో కంగన జయలా నటించవచ్చు. కానీ కనిపించడమెలా? కంగారేం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్‌కే ప్రోస్థెటిక్ ఉంది. జయలలితలా మారడానికి లాస్ ఏంజెల్స్‌లో ప్రోస్థెటిక్కి సంబంధించిన లుక్ టెస్ట్ చేయించుకున్నారు కంగనా. సినిమాలో నాలుగు గెటప్పుల్లో ఆమె కనిపిస్తారని తెలిసింది. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకుడు. ‘‘ప్రోస్థెటిక్ మేకప్‌ను పూర్తి స్థాయిలో తొలిసారి ఉపయోగిస్తున్నాను. నా పాత్ర మీద, హావభావాల మీద ఈ మేకప్ ఎంత ప్రభావం చూపుతుందో తెలియదు. కానీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని లుక్ టెస్ట్ గురించి అన్నారు కంగనా. ముక్కు పిండే ఓనర్ ‘గులాబో సితాబో’ సినిమాలో అమితాబ్ బచ్చన్ లుక్ చూస్తే ‘ముక్కు’న వేలేసుకోకుండా ఉండలేం. సుజిత్ సర్కార్ తెరకెక్కించిన చిత్రం ‘గులాబో సితాబో’. అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా నటించారు. ఇంటిగల వాళ్లకి, ఇంట్లో అద్దెకు ఉండేవారికి మధ్య రోజూవారి సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ముక్కు పిండి అద్దె వసూళ్లు చేసే ఇంటి యజమాని పాత్రలో అమితాబ్ కనిపిస్తారు. ఈ సినిమాలో బారు ముక్కుతో కనిపిస్తారు అమితాబ్. ఇది ప్రోస్థెట్రిక్కే అని మనకు తెలిసిందే. అమితాబ్ వయసు 76. ఈ వయసులో దాదాపు మూడు గంటలు కదలకుండా మేకప్ చేయించుకోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ ‘బిగ్ బి’ కదా.. ఆయనకు చిన్న విషయంగానే అనిపించింది. అన్నట్లు అమితాబ్ ప్రోస్థెటిక్ మేకప్ ఉపయోగించడం ఇది తొలిసారి కాదు. గతంలో పా, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్, 102 నాట్ అవుట్ చిత్రాలకు కూడా వాడారు. ‘గులాబో సితాబో’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నారు. ఆత్మస్థైర్యమే అందం బాలీవుడ్ బ్యూటీక్వీన్ దీపికా పదుకోన్. స్టార్ హీరోల్లానే బాక్సాఫీస్ దగ్గర టికెట్లు తెంచగలిగే ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఆమె. ఇప్పటివరకూ అందమైన పాత్రలను అద్భుతంగా పోషించిన దీపిక, ఇప్పుడు ఆత్మస్థైర్యాన్ని స్క్రీన్ మీద చూపించడానికి సిద్ధపడ్డారు. ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందిన ‘చెప్పాక్’లో ఆమె నటించారు. మేఘన గుల్జార్ దర్శకురాలు. యాసిడ్ శరీరాన్ని కాల్చిందేమో కానీ ఆత్మస్థైర్యాన్ని కాదని ప్రేరణగా నిలిచిన లక్ష్మీగా దీపిక నటించారు. ఈ పాత్ర కోసం ప్రోస్థెటిక్ మేకప్‌ను ఉపయోగించి ఆ లుక్ తీసుకువచ్చారు. మేకప్‌కే దగ్గర దగ్గర నాలుగు గంటలు పట్టేదట. తీయడం కూడా అంత సులువు కాదు. గంటకు పైనే పట్టేదట. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం రిలీజ్. సేనాపతి ఈజ్ బ్యాక్ ప్రోస్థెటిక్ను పూర్తి స్థాయిలో పాపులర్ చేసింది ‘భారతీయుడు’ (1996) సినిమా అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో కమల్‌హాసన్, సుకన్య పాత్రలను వృద్ధులుగా హాలీవుడ్ టెక్నీషియన్లతో నమ్మించారు. ఆ సినిమాలో క్రాఫ్‌ని కుడి చేత్తో వెనక్కి దువ్వే సేనాపతి మనకు గుర్తే. ఇప్పుడు మళ్లీ ఆ పాత్రను తిరిగి తీసుకొస్తున్నారు శంకర్. 23 ఏళ్ల తర్వాత కమల్ – శంకర్ కాంబినేషన్లో ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాలోనూ కమల్ వృద్ధుడిగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 2021లో సినిమా రిలీజ్ కానుంది. గురి తప్పరు టాప్ ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు ముద్దు ముద్దుగా ఉండే పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ వయసు మళ్లిన పాత్రలు చేయడానికి సాహసించరు. అయితే తాప్సీ, భూమీ పెడ్నేకర్ ఈ రిస్క్ తీసుకున్నారు. ‘సాండ్‌కీ ఆంఖ్’ చిత్రంలో ఎనభై ఏళ్ల వృద్ధురాళ్ల పాత్రలో నటించారు తాప్సీ, భూమి పెడ్నేకర్. అరవై ఏళ్లు పైబడిన తర్వాత గన్ షూటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించి షార్ప్ షూటర్స్‌గా పేరు పొందారు ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్. వారి జీవితం ఆధారంగా ‘సాండ్‌కీ ఆంఖ్’ చిత్రం రూపొందింది. ఇందులో ప్రకాషీగా తాప్సీ, చంద్రో పాత్రను భూమి చేశారు. అక్టోబర్ 25న థియేటర్స్‌లోకి రావడం వీళ్ల టార్గెట్. బాలా.. జుట్టు గోల విభిన్న స్క్రిప్టులు ఎంచుకోవడం ఆయుష్మాన్ స్టయిల్. రోజూవారీ మనం తరచూ చూసే సమస్యలే ఆయన సినిమాల్లోని కథలు. అవే ఆయన వరుస సక్సెస్‌లకు కారణాలు. తాజాగా బట్టతలకు సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌ను తన సినిమాకు ఎంచుకున్నారు ఆయుష్మాన్. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల సమస్యలను ఎదుర్కొంటున్నారు చాలామంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌తో ‘బాలా’ సినిమా తెరకెక్కుతోంది. ఆయుష్మాన్ ఖురానా బట్టతల ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. నవంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. – గౌతమ్ మల్లాది ప్రోస్థెటిక్ మేకప్ విధానం ఏంటి? ప్రోస్థెటిక్ మేకప్‌ని స్పెషల్ మేకప్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. దీని కోసం నటుని శరీర కొలతలను ప్రోస్థెటిక్కి వాడే పదార్థాలతో తీసుకుంటారు. ఆ మౌల్డ్ ఆధారంగా కావాల్సిన రూపురేఖలను తయారు చేస్తారు. కావాల్సిన సన్నివేశాల్లో ఈ మాస్క్‌ను ధరించి నటీనటులు నటిస్తారు. ఈ మేకప్ కొలతలు ఇవ్వడానికి కొన్ని గంటల పాటు ఏ పనీ చేయకుండా అలా మేకప్ సీట్లో కూర్చుని ఉండాల్సిందే. షూటింగ్లో ఈ మేకప్ ద్వారా ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సినిమాలో ఆ పాత్ర నిడివి బట్టి ప్రతిరోజూ రెండుమూడు గంటలు మేకప్‌కే కేటాయించాలి. మేకప్ వేసుకున్న తర్వాత తినటానికి వీలుండదు. ప్యాకప్ చెప్పాక కూడా మేకప్ తీయడానికి రెండు మూడు గంటలు టైమ్ పడుతుంది. వీళ్లింత కష్టపడి ఆ కుర్చీల్లో గంటల తరబడి కూర్చునేది థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి వినోదం అందించడానికే. మేకప్‌తో నటీనటులు మారిపోతారు. వాళ్లను చూసి ప్రేక్షకులు మైమరిచిపోతారు. -
అవెంజర్స్‌తో జతకట్టిన భళ్లాల దేవ
సాక్షి, హైదరాబాద్ : హాలీవుడ్ సినిమాలో మన తెలుగు నటుడా అని ఆశ్చర్యపోకండి. రానా దగ్గుబాటి హాలీవుడ్లో జతకట్టింది నటనతో కాదు..సినిమాలో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పడం ద్వారా ఆ రూట్లో ఎంట్రీ ఇచ్చారు. అవెంజర్స్ సిరీస్‌లోనే భారీ అంచనాలతో విడుదల కాబోతున్న చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. ఈ సినిమాలో హీరోలను ఢీ కొట్టే సింగిల్‌మన్ ఆర్మీ.. అదే విలన్ తానోస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారట రానా. మరో సారి భళ్లాలదేవ విలనిజాన్ని తెర మీద వినబోతున్నారు ప్రేక్షకులు. రానా మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి మార్వెల్ కామిక్స్ చదువుతూ, సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. మార్వెల్ సంస్థ ఎవ్వరూ ఊహించని విధంగా మంచి కథలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరిస్తోందన్నారు. ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా నచ్చిన పాత్రలని ఆయన తెలిపారు. ఈ సినిమాలో విలన్ తానో పాత్రకు డబ్బింగ్ చెప్పటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో రానా డబ్బింగ్ చెప్పినట్లు గానే ఇతర భాషల్లో కూడా అక్కడి నటీనటులతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు నిర్మాతలు. -
ట్విట్టర్లో ఇక పదివేల క్యారెక్టర్స్!
ట్విట్టర్లో ఎన్నో రోజులుగా ఊరిస్తున్న ఓ కొత్తమార్పు త్వరలో రానున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ట్విట్టర్లో140 క్యారెక్టర్స్ మాత్రమే ట్వీట్ చేసే వీలుండేది. ఈ పరిమితిని 10 వేల క్యారెక్టర్స్‌కు పెంచాలని ట్విట్టర్ యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క ట్వీట్లో కేవలం 140 క్యారెక్టర్స్ ఉండటంతో ఎక్కువ సమాచారాన్ని పంచుకునే అవకాశం ఉండేది కాదు. లిమిట్ పెంచడంతో అక్షరాలతో పాటు అధిక సంఖ్యలో ఫొటోలు, వీడియోలు, ఇతర లింకులను కూడా పంచుకునే వీలుంటుంది. 'ఎక్కువమంది ట్విట్టర్ వినియోగదారులు ఫోటోల ద్వారా ట్విట్టర్లో 140 క్యారెక్టర్ల కన్నా ఎక్కువ సమాచారాన్ని ఉపయోగించడాన్ని మేము గమనించాము. ట్విట్టర్ వినియోగదారుల కోసం కొత్త మార్పులను చేయడానికి మేము వెనకాడటం లేదు' అని ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ డోర్సీ ఇది వరకే చెప్పారు. డోర్సీ వచ్చిన కొన్నిరోజుల్లోనే ట్విట్టర్లో కొత్తగా చాలా మార్పులు చేశారు. మూమెంట్స్ ఫీచర్స్, పోల్స్ ఆప్షన్, బై బటన్, ఫేవరెట్ స్థానంలో (స్టార్), హార్ట్ షేప్‌లో ఉన్న లైక్ బటన్లను ఆయనే ప్రవేశపెట్టారు. మరోవైపు 140 క్యారెక్టర్లు మాత్రమే ఉండాలని గట్టిగా వాదించేవాళ్లు మంగళవారం #beyond140లో తమ అభిప్రాయాలను తెలిపారు. కొత్తగా క్యారెక్టర్ లిమిట్ పెంచితే ట్విట్టర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందని చాలామంది యూజర్స్ అభిప్రాయపడ్డారు. కొందరు ట్విట్టర్‌కు రిప్ (రెస్ట్ ఇన్ పీస్) అంటూ... ట్వీట్ చేశారు.