Charmila
-
మళ్లీ తెలుగులో నటించాలని ఉంది
చార్మి అందరికీ తెలుసు. చార్మిలా తెలిసి ఉండకపోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మీ జంటగా నటించిన ‘ప్రాణదాత’ (1992) సినిమా చూసినవారికి చార్మిలా తెలిసే ఉంటుంది. అందులో ఏయన్నార్, లక్ష్మీ కూతురిగా నటించిందామె. ఆ తర్వాత భానుమతీ రామకృష్ణ స్వీయదర్శకత్వంలో రూపొందించిన ‘అసాధ్యురాలు’లో నటించింది. ‘ప్రేమ ఖైదీ’లో మాలాశ్రీ ఫ్రెండ్‌గా నటించింది. ఆ తర్వాత కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ తెలుగులో కనిపించాలనుకుంటోంది. ‘‘అప్పట్లో తెలుగులో హీరోయిన్గా నటించాను. ఇప్పుడు తమిళ, మలయాళ భాషల్లో అక్క, వదిన, అమ్మ పాత్రలు చేస్తున్నాను. అవకాశం వస్తే తెలుగులోనూ ఆ పాత్రలు చేయాలని ఉంది’’ అన్నారు చార్మిలా. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ నటించిన ‘నల్లదొరు కుటుంబం’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. హీరోయిన్ కావాలన్నది తన కల. మలయాళ చిత్రం ‘ధనమ్’ ద్వారా ఆ కల నెరవేరింది. ప్రశాంత్ సరసన చేసిన ‘కిళక్కే వరుమ్ పాట్టు’ ద్వారా కథానాయికగా తమిళ్‌కి çపరిచయం అయ్యారు. తమిళంలో పది సినిమాలకుపైగా, మలయాళంలో 40 సినిమాలకు పైగా కథానాయికగా నటించారు. హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న చార్మిలా బాబు పుట్టాక ఇంటిపట్టున ఉండాలనుకున్నారు. ‘‘మా అత్తగారితో నాకు సఖ్యత లేకుండాపోయింది. నా భర్తతో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. దాంతో విడిపోయాం. అయితే పిల్లలకు తల్లీదండ్రీ ఇద్దరూ ముఖ్యమే కాబట్టి నెలకోసారి ఆయన వచ్చి బాబుని చూసి వెళతారు. మేం ఫ్రెండ్లీగా ఉంటాం’’ అన్నారు చార్మిలా. సింగిల్ పేరెంట్‌గా కొడుకు బాధ్యతను మోస్తున్న చార్మిలాకి తల్లి, పెద్దమ్మ, బాధ్యతలు కూడా ఉన్నాయి. అందుకే ఇండస్ట్రీకి రీ–ఎంట్రీ ఇచ్చారు. ఎక్కువ సినిమాల్లో నటించాలనుకుంటున్నారు. ప్రస్తుతం తమిళంలో ఆమె ‘కన్నిరాశి’, మలయాళంలో ‘కొచ్చిన్ షాదీ అట్ చెన్నై 03’, ప్రియపట్టవర్’.. ఇలా నాలుగైదు సినిమాలు చేస్తున్నారు. ‘‘అమ్మ, వదిన, అక్క పాత్రలంటే ఒక్కో సినిమాకి ఒకటీ రెండు రోజుల్లో షూటింగ్ చేసేస్తారు. నెలకి మహా అయితే ఓ పది రోజులు షూటింగ్ ఉంటుంది. అదే ఎక్కువ భాషల్లో చేస్తే ఎక్కువ సినిమాలు చేయొచ్చు కదా. అందుకే తెలుగులోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు చార్మిలా. -
అంతా పోగొట్టుకున్నా.. అవకాశాలివ్వండి
తమిళసినిమా: సినీ రంగం ప్రతిభను గౌరవిస్తుంది. అవకాశాలను అందిస్తుంది. డబ్బు, పేరు, అంతస్తు అన్నీ ఇస్తుంది. అయితే దాన్ని నిలబెట్టుకోవాలి. లేకపోతే జీవితం కడగళ్ల పాలే. ఎప్పుడో తనువు చాలించిన మహానటి సావిత్రి కడ జీవితం గురించి ఇప్పటికీ చర్చించుకుంటుంటాం. అయితే ఈ తరం హీరోయిన్లు చాలా ప్రీ ప్లాన్డ్గా జాగ్రత్త పడుతూ సంపాదించింది కూడబెట్టుకుంటున్నారు. ఇతర రంగాల్లో ఇన్వెస్ట్ చేసి పలు రెట్లు పెంచుకుంటున్నారు. అలాంటిది నటి చార్మీళ లాంటి కొందరు హీరోయిన్లు భవిష్యత్ గురించి ఆలోచించకుండా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. తమిళంలో నల్లదోరు కుటుంబం, తైయల్క్కారన్, కిళక్కే వరుమ్ పాట్టు, ముస్తాఫా మనసే మౌనమా తదితర చిత్రాల్లో కథానాయకిగా నటించి బాగా వెలిగిన నటి ఛార్మిళ. అలాంటిది ఇప్పుడు అన్నీ కోల్పోయాను అవకాశాలు ఇచ్చి ఆదుకోండి అని అభ్యర్థించే స్థాయికి దిగజారింది. ఆమె ఏమంటుందో చూద్దాం. నేను ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగినా, నా జీవితంలో అనూహ్య సంఘటనలు జరిగాయి. ఇప్పుడు నా వద్ద డబ్బు లేదు. ఆరోగ్యం పాడయ్యింది. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో ముందే జరిగి ఉంటే ఆత్మహత్య చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అది కూడా చేయలేను. మంచంలో పడ్డ నా తల్లిని చూసుకోవాలి. కొడుకు బాగోగులు చూసుకోవాలి. అందుకే ఆత్మహత్యకు పాల్పడలేదు. ఒక కాలంలో చాలా చిత్రాల్లో నటించాను. ఇప్పుడు ప్రముఖ దర్శకులను అవకాశాలు అడిగితే ఇవ్వడం లేదు. నాకు నటించడానికి అవకాశాలు ఇవ్వండి. భవిష్యత్ కోసం డబ్బును కూడబెట్టుకోలేకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. సినిమాల్లో ముమ్మరంగా నటిస్తున్నప్పుడు ఆడంబర జీవితాన్ని అనుభవించాను.తరచూ విదేశాలకు వెళ్లి నక్షత్ర హోటళ్లలో గడిపాను. సంపాదించిన దానిలో సగం విదేశాలకు వెళ్లడానికే ఖర్చు చేశాను. వివాహానంతరం నా జీవితం తలకిందులైంది. ఇంటిని, స్థిరాస్తులను విక్రయించేశాను. నేను చేసిన మరో పెద్ద తప్పు ఇంటిని అమ్మడం. ఆ ఇల్లు నాకు చాలా ఆత్మస్ధైర్యాన్నిచ్చింది. అలాంటి ఇల్లు పోయిన తరువాత మానసికంగా, శారీరకంగా నష్టపోయాను. ఆవకాశాలు ఇచ్చి ఆదుకోండి అని ధీనంగా అభ్యర్థిస్తున్నారు.