charminor
-
పాతబస్తీపై ప్రత్యేక దృష్టి.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాటేలా..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో ఎన్నెన్నో చారిత్రక కట్టడాలకు పునర్వైభవం కల్పించి హైదరాబాద్ నగర కీర్తిసిగలో వాటి ప్రాధాన్యత చెక్కు చెదరకుండా చేసేందుకు పలు కార్యక్రమాలు రూపొందించినప్పటికీ, పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటిని త్వరితంగా పూర్తిచేసేందుకు పాతబస్తీ కేంద్రంగా పనిచేస్తున్న కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)కి పలు పనులు అప్పగించారు. వాటిని త్వరితంగా పూర్తిచేయడం ద్వారా పాతబస్తీలోని కట్టడాలు.. ముఖ్యంగా వారసత్వ కట్టడాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు త్వరితంగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చదవండి: ఏడేళ్లలో పాతబస్తీ అభివృద్ధికి రూ. 14,887 కోట్లు: కేటీఆర్ తద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలతోపాటు పాతబస్తీకి సైతం తగిన ప్రాధాన్యతనిచ్చినట్లవుతోందని అభిప్రాయపడుతోంది. అంతేకాదు.. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వాటిని పునరుద్ధరించి, ఆధునీకరించడం ద్వారా పర్యాటకంగానూ ప్రజలను ఆకట్టుకోవచ్చుననేది ఆలోచన. ట్యాంక్‌బండ్ మీద విజయవంతమైన ఫన్డే–సన్డే కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద కూడా చేపట్టడంతో సాధించిన విజయంతో పాతబస్తీలోని అన్ని ప్రముఖ ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. చదవండి: ఫ్రెంచ్ తెలుగు భాష పరిశోధకుడితో కేటీఆర్ భేటీ పాతబస్తీ అభివృద్ధి, పర్యాటక ఆకర్షణలుగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, అవి పూర్తికాలేదు.ఆపనులు జీహెచ్ఎంసీ, తదితర సంస్థల పర్యవేక్షణ లో జరుగుతుండటంతో జీహెచ్ఎంసీలోనే పనుల ఒత్తిడి, తదితర కార్యక్రమాలతో పాతబస్తీ పనులు కుంటుపడుతున్నాయనే అభిప్రాయాలున్నాయి. అంతేకాకుండా పాతబస్తీ కేంద్రంగా ఉన్న పాతబస్తీలోని ప్రజల మౌలిక సదుపాయాలు, పాతబస్తీ అభివృద్ధి పట్టించుకోవాల్సిన కుడాకు చేతినిండా పనిలేకపోవడాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న మునిసిపల్ పరిపాలన,పట్టణాభివృద్ధిశాఖ కొన్ని ముఖ్యమైన పనులను జీహెచ్ఎంసీ నుంచి కుడాకు బదిలీ చేసింది. అంతేకాదు వాటిని దగ్గరుండి పూర్తిచేసేందుకు అవసరమైన ఇంజినీర్లు, ఇతరత్రా అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్ మీద కుడాకు పంపించాల్సిందిగా ఆదేశించడంతో జీహెచ్ఎంసీ ఆమేరకు చర్యలు చేపట్టింది. సదరు పనులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల్ని సైతం జీహెచ్ఎంసీ బడ్జెట్‌నుంచి ఖర్చు చేస్తారు. ఇలా నిధులు, విధులు నిర్వహించే సిబ్బందిని కేటాయించడం ద్వారా పాతబస్తీలోని వారసత్వ, కళాత్మక భవనాలను, మార్కెట్లను వినూత్నంగా తీర్చిదిద్దనున్నారు. ఇవీ పనులు.. పాతబస్తీ ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, హౌసింగ్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన కుడాకు విద్య, వినోదం, మార్కెట్ సదుపాయాల కల్పనవంటి బాధ్యతలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ నామ్కేవాస్తేగా మారిన కుడాకు తగిన ప్రాధాన్యత కల్పించేందుకు, పాతబస్తీ అభివృద్ధి,సుందరీకరణపనులు త్వరితంగా చేసేందుకు దిగువ పనుల్ని అప్పగించారు. ► పాతబస్తీలోని వారసత్వ భవనాల పరిరక్షణ, పునరుద్ధరణ. ► పూర్తికావాల్సిన చార్మినార్ పాదచారుల పథకంలో మిగిలిన పనులు ► లాడ్‌బజార్ పాదచారుల పథకం ► సర్దార్‌మహల్ పునరుద్ధరణ, అభివృద్ధి, మ్యూజియం ఏర్పాటు ► మీరాలంమండి, ముర్గీచౌక్ ఆధునీకరణ, అభివృద్ధి పనులు ► మీరాలం చెరువు పరిరక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి డిప్యుటేషన్‌పై అధికారులు పనులు పర్యవేక్షించేందుకు జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు బాధ్యతలప్పగించారు. వీరిలో కొందరిని జీహెచ్ఎంసీ నుంచి డిప్యుటేషన్ మీద కుడాకు బదిలీ చేశారు. కొందరికి జీహెచ్ఎంసీ బాధ్యతలతోపాటు అదనంగా కుడా పరిధిలోని పనుల బాధ్యతలు అప్పగించారు. -
అక్కడంతా సపరేటు: అబ్బాయి పుడితే రూ. 2 వేలు, మరి అమ్మాయికి..
సాక్షి, చార్మినార్: పేట్లబురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నా.. వైద్య సేవలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. దీంతో గర్భిణులు ఇబ్బందులకు గురవుతున్నారు. పాతబస్తీలో గర్భిణుల కోసం అత్యంత అధునాతనమైన వైద్య సేవలు అందించడానికి పేట్ల బురుజులో ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఉంది. ఇక్కడ దోమల బెడద అధికంగా ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బాత్రూంలతో పాటు పారిశుద్ధ్య సమస్య అధికంగా ఉందంటున్నారు. డబ్బులు ఇవ్వందే ఏ పనీ కాదు... ► కింది స్థాయి సిబ్బంది గర్భిణుల వద్ద నుంచి ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని బోరు మంటున్నారు. ► మగ పిల్లవాడు పుడితే రూ. 2 వేలు, ఆడపిల్ల పుడితే రూ.15 వందలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► ప్రసవం జరిగిన వెంటనే పాప, బాబులను చూపించడానికి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా వినిపిస్తుంటాయి. ► అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన అవసరం ఉందని రోగులు కోరుతున్నారు. ► ఈ విషయాన్ని సంబంధిత వైద్యాధికారులతో పాటు సిబ్బంది ఖండించారు. ► వారి సంతోషం కోసం చాయ్ తాగమని ఎవరైనా డబ్బులిస్తే ఇచ్చి ఉండవచ్చుగానీ..సిబ్బంది డిమాండ్ చేయడం లేదన్నారు. 634 పడకల ఆస్పత్రిలో రౌండ్ ది క్లాక్ వైద్య సేవలు.. ► పాతబస్తీ పేద మహిళలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో దివంగత నేత డాక్టర్ వైఎస్‌రాజ శేఖర్‌రెడ్డి పేట్ల బురుజులో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. ► మొదట్లో 462 పడకల ఈ ఆస్పత్రిలో మరో 172 పడకలను పెంచి..మొత్తం 634 తో రౌండ్ ది క్లాక్ వైద్య సేవలను అందిస్తున్నారు. ► ప్రతి రోజూ ఉదయం అవుట్ పేషంట్లకు వైద్య సేవలు కొనసాగుతాయి. అవుట్ పేషంట్ విభాగం మూసిన అనంతరం అత్యవసర కేసులను రౌండ్ ది క్లాక్ తీసుకుంటారు. ► కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేస్తారు. మల,మూత్ర,రక్త పరీక్షలతో పాటు ఎక్స్ రేను ఉచితంగా నిర్వహిస్తారు. ► రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో అసౌకర్యాలు కూడా పెరుగుతున్నాయి. ► పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రిలో సౌకర్యాలను కూడా పెంచాలని రోగులు వారి బంధువులు కోరుతున్నారు. చదవండి: మాజీ కార్పొరేటర్ దారుణ హత్య.. ఖండించిన సీఎం -
హైదరాబాద్‌లో హైటెన్షన్.. సంజయ్ సవాల్
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వరదసాయంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పదివేల ఆర్థిక సాయం ఆపాలంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేరు మీద ఎన్నికల సంఘానికి రాసిన లేఖ తీవ్ర వివాదాన్ని రేపుతోంది. వరదసాయం ఆగిపోవడానికి బీజేపీ నేతలే కారణమంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగగా.. ఆ లేఖతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ సంజయ్ చెబుతున్నారు. తమను దొంగదెబ్బ తీయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిన నాటకంలో భాగమే ఈసీకి లేఖ అని ఎదురుదాడికి దిగారు. తన పేరు మీద సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ తాను రాయలేదని, సీసీఎస్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. నకిలీ లేఖపై నిజాలు తేల్చుకుందామంటూ సీఎం కేసీఆర్‌కు సంజయ్ సవాలు విసిరారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రావాలంటూ సవాల్ చేశారు. లేఖను తాను రాలేదని ఆమ్మవారిపై ప్రమాణం చేస్తానని తేల్చి చెప్పారు. (టికెట్ దక్కలేదని ఆత్మహత్యాయత్నం) దీనిలో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి చార్మినార్ వరకు శుక్రవారం బైక్ ర్యాలీకి కాషాయదళం సిద్ధమైంది. ర్యాలీగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు బండి సంజయ్ చేరుకోనున్నారు. ఇప్పటికే బీజేపి కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు సంజయ్ ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని మొదట చెప్పిన పోలీసులు.. ఆ తరువాత అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే శుక్రవారం కావడంతో చార్మినార్ వీధుల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే బీజేపీ కార్యాలయం ముందు,చార్మినార్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండార్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. -
చార్మినార్ వద్ద బ్రెయిలీ బోర్డ్: అరుంధతీ భట్టాచార్య
హైదరాబాద్: ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య శుక్రవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ముఖ్య కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ‘సభా గృహ’ అనే కొత్త ఆడిటోరియమ్‌ను ప్రారంభిం చారు. అలాగే ఎస్బీహెచ్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమై 75 వసంతాలు పూర్తికానుండటంతో బ్యాంకు ప్లాటినమ్ జూబ్లీ లోగోను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్బీహెచ్ కమ్యూనిటీ సర్వీసెస్ బ్యాంకింగ్ కార్యకలాపాల కింద ఏడాదిపాటు 15 పులుల సంరక్షణకు గానూ నెహ్రూ జంతు ప్రదర్శన శాలకు రూ.15 లక్షలు, చార్మినార్ వద్ద బ్రెయిలీ బోర్డు ఏర్పాటు, అంధులకు ప్రత్యేక దారి నిర్మాణానికి సంబంధించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు రూ.2 లక్షలను విరాళంగా అందించారు.