శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు
నర్సాపూర్,న్యూస్‌లైన్: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు అమోదం పొందే అవకాశాలు ఉన్నాయని పీసీసీ ప్రధాన కార్యదర్శి చౌటి శ్రీనివాస్‌రావు ఆశా భావం వ్యక్తం చేశారు. బుదవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్ ధృడ నిశ్చయంతో ఉన్నారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. రాబోయే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయన్నారు.
నేడు అన్నదానం
తన తండ్రి దివంగత మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి చౌటి జగన్నాథరావు రెండో వర్థంతిని పురస్కరించకుని గురువారం నర్సాపూర్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చౌటి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు తన తండ్రి విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం విగ్రహం సమీపంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, కార్యకర్తలు, అభిమానులు సకాలంలో హజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.