చందనా చక్రవర్తికి మల్కాజ్గిరి!
హైదరాబాద్: దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని ప్రధాన నగరాలపై దృష్టి సారించింది. హైదరాబాద్‌లో అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని వదిలేసి మిగతా సీట్లలో పోటీకి ఆప్ సిద్దమవుతోంది. ఇందుకోసం పలువురు పేర్లు పరిశీలిస్తోంది.
హట్ సీట్‌గా మారిన మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి సామాజికవేత్త, నటి చందనా చక్రవర్తిని పోటీకి దించాలని ఆప్ భావిస్తోంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి మాజీ ఐఏఎస్ అధికారి ఛాయా రతన్ పేరు పరిశీలిస్తోంది. నావికాదళ మాజీ అధికారి సుధీర్ పరకాల కూడా ఈ సీటు ఆశిస్తున్నారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్న ఆర్. వెంటకరెడ్డిని చేవెళ్ల నుంచి బరిలోకి దించాలని ఆప్ యోచిస్తోంది.