cheats woman
-
ఐదేళ్లు ప్రేమాయణం, పెళ్లి చేసుకుంటానని.. వేరే యువతితో
విశాఖపట్నం: ఐదేళ్లుగా ప్రేమాయణం సాగించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. శారీరకంగా దగ్గరై, ఇప్పుడు వేరే యువతిని వివాహం చేసుకోడానికి సిద్ధమయ్యాడు. ఆ యువకుడిపై స్థానిక పోలీసుస్టేషన్లో బాధితురాలు మంగళవారం ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి బాధిత యువతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదతీనార్లలకు చెందిన కారే ఆశ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలోనే ఇదే గ్రామానికి చెందిన మైలపల్లి రాము అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. ఇద్దరం భార్యాభర్తలమే నువ్వేమి అనుమానం పడక్కర్లేదంటూ కర్నాటక, హంపి,హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లాడు. శారీరకంగా అనుభవించాడు. తీరా పెళ్లి చేసుకోమని అడిగితే కట్నం ఇవ్వలేరన్న కారణంతో తిరస్కరించి ఈనెల 2వ తేదీన వేరే యువతిని వివాహం చేసుకునేందుకు మూహూర్తం పెట్టుకున్నాడు. విషయం తెలిసి నిలదీస్తే, నువ్వంటే ఇష్టమేనని కానీ మా తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకోలేనని ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ పెద్దలు రాము తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. ఇద్దరికీ వివాహం చేయాలని కోరారు.అయితే రాము కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో బాధితురాలు తన కుటుంబ సభ్యుల సాయంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన వ్యక్తితో తనకు పెళ్లి జరిపించి, న్యాయం చేయాలని కోరింది. ఇద్దరూ కలిసి వివిధ ప్రాంతాల్లో తీసుకున్న ఫొటోలు, వాట్సాప్ చాటింగ్‌ను ఆమె పోలీసులకు చూపించింది. దీనిపై ఎస్ఐ వెంకన్నను వివరణకోరగా మెలపల్లి రాముపై బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేశామని తెలిపారు. -
ఆ వకీలు నిత్యపెళ్లికొడుకు .. ముచ్చటగా మూడోసారి
సాక్షి, మైసూరు (కర్ణాటక): పేరుకు న్యాయవాది, కానీ చేసేది మాత్రం మహిళలకు అన్యాయం. జిల్లాలోని కేఆర్ నగరలో సీవీ సునీల్ కుమార్ అనే న్యాయవాది మూడు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు. శివమొగ్గ సాగర తాలూకాకు చెందిన 36 ఏళ్ల మహిళను మ్యాట్రిమొని వెబ్సైట్లో పరిచయం చేసుకుని 2020, జూన్ 18న పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి రూ. 5 లక్షలను తీసుకున్నాడు. తరచూ వేధిస్తుండడంతో ఆమె కేఆర్ నగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నెలరోజులు జైల్లో ఉండి వచ్చాడు. మైసూరు బాంబూ బజార్‌కు చెందిన మహిళను గత జూలై 27న కేఆర్ నగర దేవస్థానంలో పెళ్లి చేసుకున్నాడు. కొన్నిరోజులకు ఆమెకు భర్త మొదటిపెళ్లి గురించి తెలిసి నిలదీయగా, నీతోనే కాపురం చేస్తా, రూ. 6 లక్షలు ఇవ్వాలని కోరాడు. ఆమె ససేమిరా అని పెద్దలతో పంచాయతీ పెట్టించింది. ఆమెను పుట్టింటికి పంపించేశాడు. బెంగళూరులో షాదీ.కామ్ అనే వెబ్సైట్ ద్వారా మరో మహిళను పరిచయం చేసుకుని డిసెంబర్ 2న మూడో పెళ్లి చేసుకున్నాడు. కేఆర్ నగర ఇంటిలోనే సంపారం పెట్టాడు. ఇది తెలిసి మొదటి ఇద్దరు భార్యలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టారు. -
రెండురోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు.. గుట్టుగా ఒకటి.. దర్జాగా మరొకటి
సాక్షి, ఊర్కొండ(ఖమ్మం): రెండురోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ యువకుడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ విజయభాస్కర్ కథనం మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలం ఆకునెల్లికుదురుకు చెందిన వంగ శేఖర్‌గౌడ్ హైదరాబాద్‌లో ఉంటూ ఓ యువతిని ప్రేమ పేరుతో శారీరకంగా లొంగదీసుకొని గత నెల 10న రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులోని ఓ ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉండగా కట్న కానుకల కోసం మొదటి వివాహాన్ని దాచిపెట్టి పెద్దలు నిర్ణయించిన మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని గత నెల 12న సంప్రదాయ పద్ధతిలో ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా వివాహమాడాడు. వారం తర్వాత ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి పోలీసులు శేఖర్‌గౌడ్‌కు సమాచారం అందించి ఠాణాకు రావాలని పిలిపించారు. దీంతో ఇంట్లో వనపర్తికి వెళ్తున్నానంటూ నమ్మబలికి సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. విషయం తెలుసుకున్న రెండో వివాహం అమ్మాయి బాబాయి కుటుంబ సభ్యులతో కలిసి శేఖర్‌గౌడ్‌ను అనుసరించి సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడే అన్ని విషయాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఊర్కొండ పోలీస్స్టేషన్లోనూ శేఖర్‌గౌడ్, వారి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. -
కలిసుందామని రమ్మంటే.. రూ 30 లక్షలు కాజేశాడు
అహ్మదాబాద్: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి 30 లక్షల రూపాయలు కాజేశాడని గుజరాత్‌కు చెందిన ఓ మహిళా టీచర్ (42) పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఆశీష్ మోదీ ఫోర్జరీ సంతకాలతో తన బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశాడని బాధితురాలు నవరంగ్పురకు చెందిన ఆర్తి సాంధారియా ఆరోపించింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆర్తీ ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆరేళ్లక్రితం కార్ డీలర్షిప్ వద్ద ఆమెకు సరేంద్రనగర్కు చెందిన ఆశీష్ పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరూ తరచూ కలిసేవారు. 12 ఏళ్ల క్రితం భార్య నుంచి విడిపోయినట్టు ఆశీష్ చెప్పగా, తాను కూడా భర్తకు దూరమైనట్టు ఆర్తీ చెప్పింది. సహజీవనం చేసేందుకు ఆర్తీ ఆహ్వానించగా, ఆశీష్ అంగీకరించాడు. వీరి బంధం కొన్నేళ్లు సవ్యంగా సాగింది. కాగా గత ఏప్రిల్‌లో ఆశీష్ తనకు తెలియకుండా డబ్బులు డ్రా చేసినట్టు ఆర్తీ గుర్తించింది. ఏటీఎమ్ కార్డుల నుంచి డబ్బు కాజేయడంతో పాటు ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిక్ బ్యాంక్ ఎకౌంట్ల నుంచి 10 లక్షలు డ్రా చేసినట్టు తెలుసుకుంది. ఇక క్రెడిట్ కార్డు ఉపయోగించి మరో 8 లక్షలు వాడుకున్నట్టు గుర్తించింది. ఈ విషయంపై ఆశీష్‌ను నిలదీయగా, డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆర్తీకి దూరంకావడంతో పాటు ఫోన్ చేసినా మాట్లాడేవాడు కాదు. నాలుగేళ్ల క్రితం వ్యాపారనిమిత్తం 9 లక్షల రూపాయలు, ఏడాది క్రితం మరో నాలుగు లక్షల రూపాయలు ఆశీష్కు అప్పుగా ఇచ్చినట్టు ఆర్తీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.