Checking certificates
-
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కలకలం
కాజీపేట అర్బన్: భూక్రయవిక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతూ మూడో ఖజానాగా పేరుగాంచిన రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని అరికట్టేందుకు గాను ఏసీబీ సోదాలు ప్రారంభించింది.æ ఈ మేరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు రెండు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. కాజీపేట నిట్ ఏరియాలోని వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు పర్యవేక్షించి, రోజువారి చేపడుతున్న దస్తావేజుల వివరాలను ఆరా తీశారు. స్లాట్ బుకింగ్‌తో పాటు సామాన్య రిజిస్ట్రేషన్లను, వీఎల్టీ ఆధారంగా చేపట్టాల్సిన దస్తావేజుల రిజిస్ట్రేషన్ల వివరాలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలతో తీవ్ర కలకలం రేగింది. కార్యాలయ సిబ్బందితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్ రైటర్లపై నజర్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు, భూకొనుగోలుదారుడు స్వయంగా దస్తావేజులను తయారు చేసుకునేందుకు పబ్లిక్ డేటా ఎంట్రీకి శ్రీకారం చుట్టింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థకు స్వస్తి పలికారు. కాగా, డాక్యుమెంట్ రైటర్లు చెప్పిందే ‘రైట్’ అంటూ పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్లుగా ఉద్యోగ విరమణ పొందిన కొందరు డాక్యుమెంట్ రైటర్లుగా అవతారమెత్తి ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లకు తెరలేపుతున్నారు. ఏకంగా రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రైటర్లుగా మారుతున్నారంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వారి హవా తెలుసకోవచ్చు. వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూత వేటు దూరంలోని డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలను ఏసీబీ అధికారులు పర్యవేక్షించి రోజువారీ వివరాలపై కూపీ లాగినట్లు సమాచారం. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు
కడప స్పోర్ట్స్ : వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న జిల్లాస్థాయి క్రీడా ఎంపికలుసోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ ఎంపికలకు జిల్లాలోని 23 మండలాల నుంచి 59 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 42 మంది బాలురు, 17 మంది బాలికలు ఉన్నారు. తొలుత విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన పిమ్మట పదిమంది చొప్పున బృందాలుగా ఏర్పాటుచేసి క్రీడాఎంపికలను నిర్వహించారు. క్రీడాకారుల ఎత్తు, బరువుతో పాటు వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, మెడిసినల్‌బాల్, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, 6 ఇంటూ 10 మీటర్ల పరుగుపందెం, 800 మీటర్ల పరుగుపందెం తదితర అంశాల్లో ఎంపికల ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ ఎం.ఎస్.ఎల్.ఎన్. శర్మ మాట్లాడుతూ ఈనెల 25, 26 తేదీల్లో రెండురోజుల పాటు ఎంపికలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోనే క్రీడాపాఠశాల ఉన్నందున పెద్దసంఖ్యలో విద్యార్థులు ఎంపికలకు వస్తారని విస్తున్నామన్నారు. శాప్ డైరెక్టర్ డి.జయచంద్ర మాట్లాడుతూ జిల్లాలో క్రీడాపాఠశాల ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తగిన ప్రచారం లేకపోవడంతో ఆశించిన మేర క్రీడాకారులు రాలేదన్నారు. ప్రతి యేడాది క్రీడాఎంపికల క్యాలండర్ ప్రకటించి జూన్‌లోనే ఎంపికల ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అడ్‌హక్ కమిటీ చైర్మన్ తోటకృష్ణ మాట్లాడుతూ క్రీడాపాఠశాలలో సీటు సాధిస్తే క్రీడల్లో రాణించేందుకు చక్కటి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు గౌస్‌బాషా, సుదర్శన్, షఫీ, డీఎస్ఏ సిబ్బంది అక్బర్, బాలనాగయ్య రాజు, బాషా, క్రీడాకారులు పాల్గొన్నారు.