చెరువు కాలుష్యంపై గ్రామస్తుల ఆందోళన
కీసర (రంగారెడ్డి) : చెరువు నీరు కలుషితం కావటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం అహ్మద్గూడలోని డంపింగ్ యార్డు నుంచి మురుగు నీరు చీర్యాల గ్రామ చెరువులో కలుస్తోంది. దీనిపై గ్రామస్తులు గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. దీంతో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఆగకుండా కురుస్తున్న వానలోనే మూడు గంటలుగా ఆందోళన కొనసాగుతోంది.