cheeters
-
ఆన్లైన్ దొంగల అరెస్ట్
సాక్షి, తిరుపతి క్రైం : ఉద్యోగాలు ఇస్తామని మోసపూరిత ప్రకటనలు చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఆన్లైన్ ఘరానా దొంగలను క్రైం పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ మేరకు క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. బెంగళూరులోని నాగిశెట్టిపల్లి భువనేశ్వర్ లేఔట్‌కు చెందిన శ్రీనివాస గోవిందప్ప కుమారుడు శ్రీనివాస శేషు(21) స్నేహితుడు అనీల్‌తో కలిసి మైండ్‌ట్రీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటర్నెట్ ద్వారా ప్రకటనలు ఇచ్చేవాడు. అదేవిధంగా ఫేస్‌బుక్‌లోనూ పోస్టింగులు పెట్టేవాడు. వాటిని నమ్మిన తిరుపతి నగరానికి చెందిన మునికుమార్యాదవ్, రమేష్‌బాబు వారిని సంప్రదించారు. వారికి శ్రీనివాస శేషు కంపెనీ నుంచి ఇంటర్వ్యూ అపాయింట్ ఆర్డర్లతో కూడిన ఐడీని మెయిల్‌కు పంపించి డబ్బులు అకౌంట్లో వేయమన్నాడు. మునికుమార్ యాదవ్, రమేష్ బాబు ఇద్దరూ కలిసి రూ.5,72,500 శ్రీనివాస శేషు అకౌంట్లో వేశారు. చాలా రోజులు జరిగినా వారికి ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు ఇవ్వాలని నిలదీశారు. దీనికి శ్రీనివాస శేషు తనకు పెద్దవాళ్లు తెలుసని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని తెగేసి చెప్పాడు. బాధితులు క్రైం పోలీసులు ఆశ్రయించగా ఎస్ఐ వెంకటనరసింహా కేసు నమోదు చేసి నిందితులను బెంగళూరులో అరెస్ట్ చేశారు. -
అక్రమార్కులపై క్రిమినల్ కేసులు
అనుమతిలేని ఇళ్లను తొలగిస్తాం సబ్‌కలెక్టర్ శశాంక మల్యాల : నూకపల్లి అర్బన్‌హౌసింగ్ కాలనీలోని మూడు నెలలుగా ఇళ్ల స్థలాలు విక్రయిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారని అధికారులపై జగిత్యాల సబ్‌కలెక్టర్ శశాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లోగా ఇళ్ల స్థలాలు విక్రయించిన కాంట్రాక్టర్లు, దళారులు జాబితా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమార్కులపై క్రిమినల్ కేసు నమోదుకు సిఫార్సు చేస్తామని, పట్టాలు లేకుండా నిర్మించుకున్న ఇళ్లను సైతం తొలగిస్తామని హెచ్చరించారు. మండలంలోని నూకపల్లి అర్బన్‌హౌసింగ్‌కాలనీని సబ్‌కలెక్టర్ శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2008లో 5వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, ఆన్లైన్ జాబితా ప్రకారం 1,676 మంది మాత్రమే అర్హులున్నారని తెలిపారు. 2008లో పట్టాలు పొంది ఇళ్లు నిర్మించుకోని వారి పట్టాలు సైతం రద్దయినట్లు చెప్పారు. ఆన్లైన్లో నమోదైన 1676 గహాలు ఏయే దశలో ఉన్నాయో సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా జగిత్యాల మున్సిపాలిటీ, హౌసింగ్, తహసీల్దార్ కార్యాలయాలతోపాటు అర్బన్ హౌసింగ్‌కాలనీలో లబ్ధిదారుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్, జగిత్యాల తహసీల్దార్ మధుసూదన్, హౌసింగ్ డీఈఈ రాజేశం, ఏఈ రాజమౌళి, ఆర్ఐ రాజిరెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు.