అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు | cases on cheeters | Sakshi
Sakshi News home page

అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు

Published Sat, Aug 20 2016 5:56 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు

అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు

  • అనుమతిలేని ఇళ్లను తొలగిస్తాం
  • సబ్‌కలెక్టర్‌ శశాంక
  • మల్యాల : నూకపల్లి అర్బన్‌హౌసింగ్‌ కాలనీలోని మూడు నెలలుగా ఇళ్ల స్థలాలు విక్రయిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారని అధికారులపై జగిత్యాల సబ్‌కలెక్టర్‌ శశాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లోగా ఇళ్ల స్థలాలు విక్రయించిన కాంట్రాక్టర్లు, దళారులు జాబితా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమార్కులపై క్రిమినల్‌ కేసు నమోదుకు సిఫార్సు చేస్తామని, పట్టాలు లేకుండా నిర్మించుకున్న ఇళ్లను సైతం తొలగిస్తామని హెచ్చరించారు. మండలంలోని నూకపల్లి అర్బన్‌హౌసింగ్‌కాలనీని సబ్‌కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2008లో 5వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, ఆన్‌లైన్‌ జాబితా ప్రకారం 1,676 మంది మాత్రమే అర్హులున్నారని తెలిపారు. 2008లో పట్టాలు పొంది ఇళ్లు నిర్మించుకోని వారి పట్టాలు సైతం రద్దయినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో నమోదైన 1676 గహాలు ఏయే దశలో ఉన్నాయో సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా జగిత్యాల మున్సిపాలిటీ, హౌసింగ్, తహసీల్దార్‌ కార్యాలయాలతోపాటు  అర్బన్‌ హౌసింగ్‌కాలనీలో లబ్ధిదారుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్, జగిత్యాల తహసీల్దార్‌ మధుసూదన్, హౌసింగ్‌ డీఈఈ రాజేశం, ఏఈ రాజమౌళి, ఆర్‌ఐ రాజిరెడ్డి, రాజేందర్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement