బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ సంస్థ
హైదరాబాద్: నగరంలో మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సంస్థ నిర్వాహకులు నిరుద్యోగుల నుంచి దాదాపు కోటిన్నర రూపాయలు వసూలు చేశారు. డబ్బులు చేతికి అందిన తర్వాత సాఫ్ట్వేర్ సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. బాధితులు విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
గతంలోనూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘటనలు ఉన్నాయి. ఉద్యోగాల ఆశ చూపి నిర్వాహకులు భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయడం, తర్వాత సంస్థను మూసివేసి పరారైన సంఘటనలు ఉన్నాయి.