టిప్పర్ బోల్తా: ఇద్దరు దుర్మరణం
రామకుప్పం:
చిత్తూరుజిల్లా చెల్దిగానిపల్లె రహదారిలో ఆదివారం రాత్రి టిప్పర్ బోల్తా పడడంతో మధ్యప్రదేశ్‌లోని బీజాపుర్కు చెందిన ఇద్దరు మృతిచెందారు. చెల్దిగానిపల్లె వద్ద జరుగుతున్న రోడ్డు పనుల్లో బీజాపూర్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ ఇమామ్ (35), క్లీనర్ శ్రీశైలం (39) పాల్గొన్నారు. వీరు ఆదివారం టిప్పర్‌లో కర్ణాటక ప్రాంతం మాలూరు నుంచి కంకర తీసుకొని బయలుదేరారు. చెల్దిగానిపల్లె వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో టిప్పర్ రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి బోల్తా పడింది.
ఈ సంఘటనలో టిప్పర్ ముందు భాగంలోని అద్దాలు పగిలి ఇమామ్, శ్రీశైలంల శరీరంలోకి గుచ్చుకోవడంతోపాటు తలకు బలమైన గాయాలై, అక్కడిక్కడే మృతిచెందారు. వర్షం వస్తుండడంతో గ్రామస్తులు ఆలస్యగంగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని టిప్పర్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు.