చెన్నైలో లారీ బీభత్సం
చెన్నై: గిండి సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. వాటర్ ట్యాంకర్ లారీ అదుపుతప్పి జన సమూహంపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన గిండి సమీపంలోని చెల్లమ్మల్ మహిళా కళాశాల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.