ఖమ్మం కలెక్టరేట్లో చెల్లప్ప కమిటీ విచారణ
ఖమ్మం: బోయ, వాల్మీకీ కులాలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చే విషయమై చెల్లప్ప కమిటీ బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో అధ్యయనం నిర్వహించింది. దీనికి బోయ, వాల్మీకీ, లంబాడ, కోయ సామాజిక వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. బీసీల్లో ఉండడం వల్ల తాము ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని, తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని బోయ, వాల్మీకీ కులాల వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దీన్ని లంబాడ, కోయ కులాల వారు వ్యతిరేకించారు. ఎస్టీ జాబితాలో ఉన్నవారికే న్యాయం జరగడం లేదని, కొత్తగా మరిన్ని కులాలను చేర్చితే తమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విచారణలో జాయింట్ కలెక్టర్ దివ్య, చెల్లప్ప కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.