చలో కలెక్టరేట్‌కు తరలిరావాలి
సూర్యాపేటటౌన్ : పండిట్, పీఈటీల అప్‌గ్రేడేషన్ కోసం ఈ నెల 28న కలెక్టరేట్ ఎదుట జరిVó ఉపాధ్యాయుల ధర్నాను విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు ఎన్.సోంబాబు, పి.రవికుమార్, సీహెచ్.వెంకటేశ్వర్లు, సోమయ్య పిలుపునిచ్చారు. మంగళవారం స్థానికంగా జరిగిన సమావేశంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిట్, పీఈటి అప్‌గ్రేడేషన్ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కె.సయ్యద్, మన్నె యాదగిరి, ఎ.నాగయ్య, వెంకట్‌రెడ్డి, వీరన్న, కష్ణారెడ్డి, లింగయ్య, దశరథరామారావు, సింహాద్రి పాల్గొన్నారు.