Chelsea Handler
-
'అతనితో ఇంటర్వ్యూ చాలా వరెస్ట్'
లాస్ఏంజిల్స్: యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ ప్రపంచంలో పెద్ద స్టార్ సింగర్ కావొచ్చు కానీ, అతనితో తాను చేసిన ఇంటర్వ్యూ మాత్రం ఓ పీడకల అంటోంది చెల్సియా హండ్లర్. టీవీ ప్రజెంటర్ అయిన ఆమె 2015లో బీబర్ను ఇంటర్వ్యూ చేసింది. అప్పట్లో అతని వయస్సు 15 ఏండ్లే. కానీ అతను తనను ఫ్లర్ట్ (సరసమాడటానికి) చేయడానికి ప్రయత్నించాడని, దీంతో తాను చాలా అసౌకర్యానికి గురయ్యానని ఆమె తెలిపింది. 'చెల్సియా లేట్లీ' షోలో భాగంగా అతన్ని చేసిన ఇంటర్వ్యూనే తన జీవితంలో చేసిన అత్యంత చెత్త ఇంటర్వ్యూ అని పేర్కొంది. 'అతను తనదైనశైలిలో గిమ్మిక్కులు చేశాడు. అతను మీతో సరసమాడటానికి ప్రయత్నిస్తే ఓ పిల్ల ఆకతాయి అని మీరు తోసిపుచ్చవచ్చు. కానీ నాకు అతను అలా అనిపించలేదు. చాలా అసౌకర్యంగా తోచింది' అని ఆమె చెప్పింది. -
నాలుగవ పెళ్లికి జెన్నిఫర్ లోపెజ్ రెడీ!
హాలీవుడ్ నటి జెనిఫర్ లోపెజ్ నాలుగవ పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ముగ్గురు భర్తల నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి నాలుగవ పెళ్లి అవసరమనే భావనలో జెన్నిఫర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల తన స్నేహితురాలు చెల్సియా హ్యాండ్లర్ నిర్వహించిన 'చెల్సియా లేట్లీ' టాక్ షోలో జెన్నిఫర్ పాల్లొన్నారు. ఈ టాక్ షోలో గత రొమాంటిక్ జ్క్షాపకాలను, కొత్త ప్రియుడి గురించి వెల్లడించింది. మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నాను అంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. గతంలో ఓజాని నోయా, క్రిస్ జుడ్, మార్క్ ఆంథోనిలను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మార్క్ తో వైవాహిక జీవితంలో జెన్నిఫర్ కు ఇద్దరు కవలు పెట్టారు. మూడేళ్ల క్రితం వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.