Chemical Reactor
-
జీడిమెట్ల పారిశ్రామికవాడలో పేలుడు!
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ప్రమాదం జరిగింది. జీవిక లైఫ్ సైన్సెస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతులను అంబరీష్, అన్వర్ లుగా గుర్తించారు. రియాకర్ట్ పేలుడుతో స్థానికంగా ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతోపాటు సంఘటనాస్థలంలో భారీగా మంటలు ఎగిశాయి. పేలుడు శబ్దం విని హడలిపోయిన స్థానికులు కాసేపు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. -
ఫార్మా ఫ్యాక్టరీలో పేలుడు: కార్మికులకు తీవ్ర గాయాలు
విశాఖపట్నం శివారులోని పరవాడలో గ్లోకెమ్ ఫార్మా ఫ్యాక్టరీలో శనివారం రసాయన ట్యాంకర్లో పేలుడు సంభవించింది. ఆ ప్రమాదంలో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గాజువాకలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న యాజమాన్యం హుటాహుటిన ఫ్యాక్టరీకి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును కార్మికులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మెనియం రియాక్టర్ పేలిందని ఫ్యాక్టరీ కార్మికులు వెల్లడించారు. ఆ ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ పోలీసులు విచారణ జరుపుతున్నారు.