Chenab valley
-
ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన పనులు వచ్చే ఏడాదికి పూర్తికానున్నాయి. కశ్మీర్ ను మిగతాదేశంతో కలిపే ఈ వారధిపై 2022 డిసెంబర్లో మొట్టమొదటి రైలు ప్రయాణం చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 359 మీటర్ల ఎత్తులో 467 మీటర్ల పొడవైన ఈ వారధి ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వంతెన. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా ఈ వంతెనను డిజైన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కేంద్రం ప్రత్యక్ష పర్యవేక్షణతో ఏడాదిగా పనులు వేగవంతం అయ్యాయన్నారు. ఈ రైల్వే మార్గంలో ఉధంపూర్–కాట్రా(25 కిలోమీటర్లు) సెక్షన్, బనిహాల్– క్వాజిగుండ్ (18 కి.మీ.)సెక్షన్, క్వాజిగుండ్–బారాముల్లా (118 కి.మీ.) సెక్షన్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 111 కిలోమీటర్ల పొడవైన కాట్రా–బనిహాల్ సెక్షన్లో పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. 2018 వరకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 27 శాతమే ఖర్చు కాగా ఆ తర్వాత 54 శాతం మేర వెచ్చించినట్లు అధికారులు వివరించారు. చదవండి: ఆమెతో రాఖీ కట్టించుకో, 11 వేలు ఇవ్వు: కోర్టు -
జమ్మూకాశ్మీర్లో స్వల్ప భూకంపం
జమ్మూకాశ్మీర్లో శనివారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. జమ్మూ ప్రాంతంలోని కిత్వార్, దోడా, రాంబన్, రేసి జిల్లాల్లో భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు. జమ్మూ ప్రాంతంలో భడర్వా పట్టణం కేంద్రంగా ఉదయం 5:35 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఏడాది ఆరంభం నుంచి జమ్మూలోని చెనాబ్ లోయలో భూ ప్రకంపనలు తరచూ వస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. కాశ్మీర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ తలాత్ అహ్మద్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి కారణాలను అన్వేషించారు. -
షోపియాన్ పట్టణంలో నిరవధిక కర్ప్యూ
గగరన్ క్యాంప్ వద్ద సీఆర్పీఎఫ్ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడం అనంతరం జరిగిన ఆందోళనల నేపథ్యంలో షోపియాన్ పట్టణంలో నేటి నుంచి నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి గురువారం ఇక్కడ వెల్లడించారు. మృతుడు ముహ్మద్ రాఫి రాథర్ (28)గా గుర్తించినట్లు తెలిపారు. అతడు బస్సు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీఆర్పీఎఫ్ కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారని, వారిలో బాలిక కూడా ఉందని తెలిపారు. ఆమెకు బుల్లెట్ తగిలి గాయాలయ్యాయన్నారు. వారిరువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఆ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అలాగే శుక్రవారం గగరన్ వద్ద కాల్పుల ఘటనలో నలుగురు మరణించారని, వారిలో ముగ్గురు నగర పౌరులు కాగ, ఓ తీవ్రవాది కూడా ఉన్నాడు తెలిపారు. అయితే తీవ్రవాది కాదని బీహార్ నుంచి వచ్చి అతడు ఇక్కడ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తమ దర్యాప్తులో వెల్లడించారు. కాగా తమకు అందిన సమాచారం మేరకు అతడు తీవ్రవాదీ అని రూఢీ అయిందని పేర్కొన్నారు. ఆ ఘటనపై కూడా విచారణ జరుగుతుందన్నారు. సీఆర్పీఎఫ్ కాల్పుల్లో ఓ స్థానికుడు మరణించడంతో కాశ్మీర్ వ్యాలీ, చినాబ్ వ్యాలీలతోపాటు కిష్ట్వారా, దోడ, రామ్బన్ జిల్లాల్లో గురువారం బంద్కు వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ గిలానీ పిలుపునిచ్చారు. షోపియాన్ పట్టణంలో నెలకొన్న పరిస్థితిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బుధవారం సాయంత్రం ఉన్నతాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.