వృద్ధురాలి ఆత్మహత్య
అమరాపురం(మడకశిర) : అమరాపురం మండలం పి.శివరం గ్రామానికి చెందిన చెన్నబసమ్మ(80) శనివారం రాత్రి బాగా పొద్దుపోయాక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటస్వామి ఆదివారం తెలిపారు. ఒంటరి జీవితం భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని తనువు చాలించినట్లు వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.