chenna keshavulu
-
రేణుక, ఆమె బిడ్డకు సాయం చేయండి: ఆర్జీవీ
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకకు ఆర్థిక సహాయం అందించాలని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పిలుపునిచ్చారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేణుక భవిష్యత్తు బాగు కోసం తోచిన విధంగా విరాళం అందించి తనను ఆదుకోవాలని కోరారు. ‘‘చెన్నకేశవులు భార్య రేణుక పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. అయితే రేపిస్టుల నీడ వారి భవిష్యత్తుపై పడకుండా ఉండాలంటే.. దయచేసి ఎవరికి తోచిన సాయం వారు చేయండి’’అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. యాక్షన్ ఎయిడ్ ఫర్ సోసైటల్ అడ్వాన్స్మెంట్(ఏఏఎస్‌ఏ) అకౌంట్ నంబరును షేర్ చేసి... రేణుకకు విరాళం ఇవ్వాల్సిందిగా కోరారు. కాగా దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగే నాటికి చెన్నకేశవులు భార్య రేణుక గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.(నేను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం: వర్మ) ఇక రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో మెటర్నరీ వైద్యురాలిపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం ఆమెను తగులబెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా వారిని ఘటనాస్థలికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా వారిని ఎన్కౌంటర్ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం దిశ అత్యాచారం, హత్య, నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఇక ఈ దిశ ఘటనపై తాను సినిమా తీస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. నిందితుల కుటుంబాల గురించి తెలుసుకోవడానికి నిందితుడు చెన్న కేశవులు భార్య రేణుకను ఆయన ఇటీవల కలిశారు. పలువురు పోలీసు అధికారులతోనూ భేటీ అయ్యారు. (దిశ: శంషాబాద్ ఏసీపీతో రామ్‌గోపాల్ వర్మ భేటీ) Chenna Keshavlu wife Renuka gave birth to baby girl and both are fine .What won’t be fine is their future becos of rapists ugly shadow ..Please donate whatever u can for them Account: Action Aid for societal Advancement AASA, 918010050607980 AXIS BANK IFSC code: UTIB0001454 pic.twitter.com/FzsLsRGHwd — Ram Gopal Varma (@RGVzoomin) March 7, 2020 -
ఎన్కౌంటర్; నిందితుడి భార్య స్పందన
సాక్షి, మక్తల్: తన భర్త లేకుండా బతకలేనని, తాను కూడా చనిపోతానని దిశ హత్యకేసులో నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక కన్నీటి పర్యంతమయింది. తన భర్తను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని తెలియగానే ఆమె హతాశురాలైంది. తన భర్తను తిరిగి పంపిస్తామని తీసుకెళ్లిన పోలీసులు తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నానని, తమ పెళ్లి జరిగి ఏడాది కూడా కాలేదని మీడియా ముందు గోడు వెళ్లబోసుకుంది. ‘ఇంత ఘనమా మోసము? చిన్నవయసులో పెళ్లి చేసుకున్నాం. సమత్సరం గిట్లా ఎల్లలేదు. మా ఆయనను యాడన చంపిన్రో నన్ను తీసుకెళ్లి ఆడనే చంపండి. నేను మాత్రం బతకను సార్. పంపిస్తాం, మీ ఆయనను పంపిస్తామని ఇన్ని రోజులు చెప్పిండ్రు. ఇట్ల చేస్తరా? నేను మాత్రం బతకను సార్ మా ఆయన లేకుండా. నేను చనిపోతా సార్. గర్భవతినైన నా మొకమైనా చూసి పంపిస్తరని ఇన్ని రోజులు అనుకున్నా. మా ఆయన ఎక్కడ? ఇంత ఘనమా శిక్షా? మా ఆయనను యాడికి తీసుకెళ్లి కాల్చి చంపిన్రో నన్ను గిట్ల తీసుకెళ్లి కాల్చి చంపండి’ అంటూ రేణుక కన్నీళ్లు పెట్టుకుంది. తన భర్తను తీసుకెళ్లిన వాళ్లను, అతడిని మట్టుబెట్టిన వారిని చంపాలని ఆమె కోరింది. ప్రతి కుటుంబంలోనూ ఒక్కొక్కరే.. ఎన్కౌంటర్లో చనిపోయిన నలుగురు నిందితులు తమ కుటుంబంలో ఒక్కొక్కరే కొడుకులు కావడం గమనార్హం. శుక్రవారం రాత్రి నారాయపేట జిల్లాలో మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో నలుగురి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నేరుగా శ్మశానానికి తరలించి అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్తులు అంగీకరించారు. తమ పొలంలో అంత్యక్రియలు చేయనున్నట్టు చెన్నకేశవులు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంబంధిత వార్తలు.. అందుకే కాల్పులు జరపాల్సి వచ్చింది : సజ్జనార్ దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్కౌంటర్ నలుగురు మృగాళ్ల కథ ముగిసింది.. ‘సాహో సజ్జనార్’ అంటూ ప్రశంసలు.. దిశ కేసు: నేరం చేశాక తప్పించుకోలేరు ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పోలీసులకు నోటీసులు -
లంచం ఇవ్వలేక.. తండ్రీకూతుళ్ల ఆత్మహత్య
కూతురును రైలు కిందకు తోసి తండ్రి ఆత్మహత్య మహబూబ్‌నగర: వైద్య సిబ్బందికి డబ్బులు ఇవ్వలేక.. భార్యకు వైద్యం చేయించుకోలేక మనస్తాపానికి గురై ఓ తండ్రి కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేట రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం, మృతుని సూసైడ్ నోట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. జడ్చర్లకు చెందిన నాగలక్ష్మి రెండోకాన్పు కోసం తన భర్త చెన్నకేశవులు(35)తో కలిసి సోమవారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. మరుసటి రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. సిబ్బంది ఆమెకు చికిత్స చేయించేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. అప్పటికి డబ్బులు ఇచ్చారు. గురువారం మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. దాంతో సిబ్బంది తీరుపై ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ శామ్యూల్‌కు ఫిర్యాదుచేశారు. సిబ్బంది డబ్బులకు వేధిస్తున్నారని, ఇవ్వకుంటే సరైన వైద్యం అందించడం లేదని మానసికక్షోభకు గురయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెన్నకేశవులు లేఖ రాసి జేబులో పెట్టుకుని కూతురు హర్షితతో కలిసి వీరన్నపేట సమీపంలో రైలుకిందపడి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న మృతుని భార్య నాగలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది.రైల్వేపోలీసులు మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్ తెలిపారు. బాధ్యులపై చర్యలు ఆస్పత్రిలో రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామని సూపరిటెండెంట్ డాక్టర్ శామ్యూల్ తెలిపారు. సూసైడ్‌నోట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు కలెక్టర్‌తో మాట్లాడతానని ఆయన చెప్పారు.