చెన్నకేశవస్వామిని దర్శించుకున్న ఏపీ సీఎస్
బత్తలపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు శనివారం ఉదయం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఆయన జిల్లాలోని బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లిలోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ డిజీపీ రాయుడు స్వగ్రామమైన నార్సింపల్లికి వెళుతూ మార్గమధ్యంలోని డి.చెర్లోపల్లిలో స్వామిని దర్శించుకున్నారు.
అక్కడ చెన్నకేశవస్వామిని దర్శించుకున్న అనంతరం నీరూ- చెట్టూ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. సీఎస్‌కు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ నాగభూషణం, ధర్మవరం ఆర్డీవో మల్లికార్జున, కల్యాణదుర్గం ఆర్డీవో రామారావు, స్వచ్ఛభారత్ అంబాసిడర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.